సంక్రాంతికి స్పెషల్ బస్సులు
ఆర్టీసీలోనే సురక్షిత ప్రయాణం
కరీంనగర్ రీజియన్ నుంచి 1,895 అదనపు ట్రిప్పులు
ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం.. అదనపు చార్జీలు లేవు
ఆర్టీసీ ఆర్‌ఎం బి.రాజు
కరీంనగర్‌టౌన్: సంక్రాంతి పండుగకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈనెల 22 వరకు కరీంనగర్ రీజియన్ నుంచి 1,895 ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. జేబీఎస్ నుంచి కరీంనగర్‌కు 945 ప్రత్యేక బస్సులు, ఈనెల 16 నుంచి 22వ తేదీ వరకు కరీంనగర్ నుంచి జేబీఎస్‌కు 950 ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు ప్రస్తుతం నడుస్తున్న సర్వీసులకు అదనంగా నడిపేలా నిర్ణయించారు. పండుగ సీజన్‌కు మహాలక్ష్మి పథకం తోడు కావడంతో ప్రత్యేక బస్సులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు. జేబీఎస్ నుంచి కరీంనగర్‌కు జనవరి 7వ తేదీన 30 బస్సులు 8న 30 బస్సులు, 9న 150, 10న 210, 11న 210, 12న 140, 13న 160, 14న 15 అదనపు ట్రిప్పులు నడిపించనున్నారు. కరీంనగర్ నుంచి జేబీఎస్‌కు ఈనెల 16న 130 ట్రిప్పులు, 17న 90, 18న 210, 19న 210, 20న 130, 21న 90, 22న 90 బస్సులు మొత్తంగా 950 అదనపు ట్రిప్పులు నడిపించనున్నారు.
కరీంనగర్ రీజియన్ పరిధి నుంచి జేబీఎస్‌కు సంక్రాంతి పండుగ సందర్భంగా 18,95 ప్రత్యేక బస్సులు నడుపుతున్నాం. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా అన్ని డిపోల పరిధిలోని రద్దీ ఉండే బస్‌స్టేషన్లలో డిపో మేనేజర్లు, సూపర్‌వైజర్లు వ్యవహరించాల్సిన తీరుపై ఇప్పటికే సూచించాం. ఎప్పటికప్పుడు ప్రయాణికుల పరిస్థితిని పర్యవేక్షించడానికి ఏర్పాట్లు చేపట్టాం. ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం వెసులుబాటు కల్పించాం. ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించడం సురక్షితం. – బి.రాజు, ఆర్టీసీ ఆర్‌ఎం, కరీంనగర్
సంక్రాంతికి స్పెషల్ బస్సులు


