సిరిసిల్ల ఎఫ్‌ఆర్వో సస్పెన్షన్
● ఇన్‌చార్జి ఎఫ్‌ఆర్వోగా కల్పనాదేవి
సిరిసిల్ల: అటవీ క్షేత్రాధికారి(ఎఫ్‌ఆర్వో) శ్రీహరి ప్రసాద్‌ను సస్పెండ్ చేస్తూ.. రాష్ట్ర అటవీశాఖ ముఖ్య అధికారి సువర్ణ ఆదేశాలు జారీ చేశారు. సిరిసిల్ల ఫారెస్ట్ రేంజ్ అధికారిగా ఏడాదిగా పనిచేస్తున్న శ్రీహరి ప్రసాద్ సిరిసిల్ల అటవీశాఖ ఆఫీస్‌లో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగిని లైంగికంగా వేధిస్తున్నారు. ఆమె విధుల్లో చేరినప్పటి నుంచి ఎఫ్‌ఆర్వో వేధింపులు గురి అవుతుంది. సదరు మహిళా ఉద్యోగి ఎఫ్‌ఆర్వో వేధింపులు భరించలేక ముందుగా అటవీశాఖ ఉన్నతాధికారులకు నేరుగా ఫిర్యాదు చేశారు. ఎలాంటి స్పందన లేకపోగా.. ఎఫ్‌ఆర్వో లైంగిక వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. భరించలేని సదరు మహిళా ఉద్యోగి కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బీ గీతేలకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన అధికారులు సదరు మహిళా ఉద్యోగికి ఎఫ్‌ఆర్వో అసభ్యకరమైన మెసేజ్‌లు పెట్టడం, లైంగికంగా వేధిస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ మేరకు కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బీ గీతేలు అటవీశాఖ ఉన్నతాధికారులకు సమగ్ర నివేదిక ఇచ్చారు. దీంతో సిరిసిల్ల ఎఫ్‌ఆర్వో శ్రీహరి ప్రసాద్‌ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. లైంగికంగా వేధించిన ఘటనలో ఎఫ్‌ఆర్వో సస్పెండ్ కావడం అటవీ శాఖలో చర్చనీయాంశమైంది. ఖమ్మం జిల్లాకు చెందిన శ్రీహరిప్రసాద్ సిరిసిల్ల ఎఫ్‌ఆర్వోగా ఏడాదిగా పనిచేస్తున్నారు.
ఇన్‌చార్జి ఎఫ్‌ఆర్వోగా కల్పనాదేవి
సిరిసిల్ల ఇన్‌చార్జి ఫారెస్ట్ రేంజ్ అధికారిగా కల్పనాదేవిని అటవీశాఖ నియమించింది. జిల్లాలో ఫ్లయింగ్ స్క్వాడ్ ఎఫ్‌ఆర్వోగా పనిచేస్తున్న కల్పనాదేవికి సిరిసిల్ల అటవీక్షేత్ర అధికారిగా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. గతంలో శ్రీహరి ప్రసాద్ కంటే ముందు కల్పనాదేవి ఎఫ్‌ఆర్వోగా పని చేశారు.
కల్పనాదేవి, ఇన్‌చార్జి ఎఫ్‌ఆర్వో
శ్రీహరి ప్రసాద్
సిరిసిల్ల ఎఫ్‌ఆర్వో సస్పెన్షన్


