మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి
కరీంనగర్: మహిళలు తమ ఆత్మగౌరవం కాపాడుకుంటూ అన్ని రంగాల్లో ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. బుధవారం కరీంనగర్ కళాభారతిలో డెమోక్రటిక్ సంఘ ఆధ్వర్యంలో జిల్లాలోని పలువురు మహిళా వార్డు సభ్యులకు సన్మానం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా కలెక్టర్‌తోపాటు డెమోక్రటిక్ సంఘ కో–ఫౌండర్, సినీ నటి రెజీనా హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఫౌండేషన్ సాయంతో మహిళలు ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించడం అభినందనీయమన్నారు.రెజీనా కసాండ్రా మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత మహిళల్లో అసాధారణ శక్తి ఉంటుందని, సద్వినియోగం చేసుకుంటే ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారన్నారు.


