మెడికల్ కాలేజీకి దేహదానం
యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): సదాశయ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రావణ్‌కుమార్ బావమరిది, రిటైర్డ్ హెడ్‌మాస్టర్ ఆర్తి నరసింహస్వామి(75) అనారోగ్యంతో మంగళవారం మృతి చెందారు. ఆయన ఆశయం మేరకు కుటుంబ సభ్యులు పార్థివదేహాన్ని మేడ్చల్‌లోని మెడిసిటీ మెడికల్ కాలేజీకి బుధవారం దానం చేశారు. ఆయన సతీమణి శ్రీలతాదేవి నేత్రదానం చేయగా, తండ్రి నారాయణస్వామి దేహం, తమ్ముడి భార్య నిర్మలాదేవి శరీరదానం చేశారని సంస్థ అధ్యక్షుడు శ్రావణ్‌కుమార్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని ప్రతీఒక్కరు నేత్ర,, శరీర, అవయవ దానాలకు ముందుకు రావాలని కోరారు. మెడిసిటీ మెడికల్ కాలేజీ అనాటమీ హెడ్ దేవి తదితరులు పాల్గొన్నారు.
మెడికల్ కాలేజీకి దేహదానం


