గల్ఫ్ నుంచి స్వగ్రామానికి మృతదేహం
కథలాపూర్(వేములవాడ): కథలాపూర్ మండలం చింతకుంట గ్రామానికి చెందిన వేముల చొక్కయ్య(55) దుబాయిలో మృతిచెందాడు. ఆయన మృతదేహం బుధవారం స్వగ్రామానికి చేరింది. చొక్కయ్య దుబా యిలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. గతనెల 31న డ్యూటీకి వెళ్లి రాత్రి తన గదికి వచ్చాడు. రాత్రి 7 గంటల సమయంలో చాతీలో నొప్పి ఉందంటూ పడిపోయాడు. తోటి మిత్రులు గమనించేసరికే మృతి చెందాడు. చొక్కయ్య పదేళ్లుగా దుబాయి వెళ్లివస్తున్నాడు. రెండు నెలల క్రితం వచ్చి తిరిగి వెళ్లినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. మృతదేహం ఇంటికి చేరడంతో కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. చొక్కయ్యకు భార్య నర్సవ్వ, ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు.
కువైట్ నుంచి..
కోనరావుపేట: కువైట్‌లో ఈనె ల 4న మృతి చెందిన మారుపాక నర్సయ్య మృతదేహం బుధవారం చింతకుంటకు చేరింది. వివరాలు ఇలా.. కనగర్తికి చెందిన నర్సయ్య ఉపాధి నిమిత్తం కొంతకాలంగా కువైట్ దేశానికి వెళ్తున్నాడు. భార్య పిల్లకు కరీంనగర్ మండలం చింతకుంటలో ఉంటున్నారు. ఏడాది క్రితం కువైట్‌కు వెళ్లిన నర్సయ్య ఈనెల 4న తన గదిలో గుండెపోటుకు గురై మృతి చెందాడు. మృతదేహం బుధవారం రాగా, భార్య పిల్లలు చింతకుంటలో ఉండటంతో అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు.
సుధాకర్, శ్రీకాంత్‌ను కోర్టులో హాజరు పర్చాలి
సిరిసిల్లటౌన్: రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శుద్ధపల్లి సుధాకర్, రాష్ట్ర కమిటీ సభ్యుడు శ్రీకాంత్‌లను వెంటనే కోర్టులో హాజరుపర్చాలని ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి బానోతు సంతోష్‌నాయక్ డిమాండ్ చేశారు. ఈమేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 6న మధ్యాహ్నం 2గంటలకు సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం సారంపల్లిలోని వారి స్వగృహంలో శ్రీకాంత్‌ను సివిల్ డ్రెస్‌లో ఉన్న పోలీసులు, రాత్రి 8 గంటల ప్రాంతంలో ఉమ్మడి నిజమాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో సుధాకర్ స్వస్థలంలో పోలీసులు అదుపులో తీసుకున్నారని పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారని రైతు కూలీ సంఘం నిషేధిత సంఘం కాదని, ప్రభుత్వం గుర్తించుకోవాలని తెలిపారు.
గల్ఫ్ నుంచి స్వగ్రామానికి మృతదేహం


