రెచ్చిపోయిన దొంగలు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్, రాచర్లగొల్లపల్లి గ్రామాల్లో మంగళవారం రాత్రి దొంగలు రెచ్చిపోయారు. మూడు ఇళ్లల్లో చోరీకి పాల్పడి నగలు, నగదు, బైక్ ఎత్తుకెళ్లారు. ఎస్సై రాహుల్‌రెడ్డి తెలిపిన వివరాలు.. రాచర్లబొప్పాపూర్‌కు చెందిన నరెండ్ల సంతోష్ ఇంటి ఎదుట నిలిపిన బైక్ అపహరణకు గురైంది. అదే గ్రామానికి చెందిన మొడుసు ఎల్లవ్వ ఇంటికి తాళం వేసి తన కూతురు ఇంట్లో పడుకుంది. బుధవారం ఉదయం ఇంటికొచ్చి చూడగా తాళం పగులగొట్టి ఉంది. లోనికి వెళ్లి పరిశీలించగా రూ.4వేల నగదు, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించింది. వంగ వజ్రవ్వ ఇంటికి తాళం వేసి కొడుకు వద్ద వెళ్లగా వెండి ఆభరణాలు, రూ.10వేలు నగదు ఎత్తుకెళ్లారు. దీంతోపాటు రాచర్లగొల్లపల్లిలోని ఓ ఇంట్లో దొంగలు చొరబడి నగదు ఎత్తుకెళ్లారు. ఒకే రోజు రెండు గ్రామాల్లో మూడు ఇళ్లల్లో దొంగలు పడడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు క్లూస్‌టీమ్‌తో వెళ్లి పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాహుల్‌రెడ్డి తెలిపారు.
రెండు గ్రామాలు.. మూడు ఇళ్లలో చోరీ
తాళం వేసిన ఇళ్లే టార్గెట్
బంగారం, నగదు, బైక్ అపహరణ


