జమ్మికుంట మున్సిపల్‌లో ఏసీబీ తనిఖీలు
జమ్మికుంట(హుజూరాబాద్): జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు కలకలం రేపాయి. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఏసీబీ డీఎస్పీ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో ముగ్గురు సీఐలు, 12 మంది బృందంతో రికార్డులు పరిశీలించారు. మున్సిపల్‌లో 2025 సంవత్సరానికి సంబంధించిన అటెండెన్స్, లీవ్ రికార్డులు, ఇన్, అవుట్ వార్డు రిజిస్టర్, బిల్డింగ్ పర్మిషన్స్, ఎల్‌ఆర్‌ఎస్ తదితర రికార్డులు తనిఖీ చేశారు. కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ సిబ్బంది వద్ద అనధికారికంగా ఉన్న రూ.41,170 నగదు స్వాధీనం చేసుకున్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగి శానిటరీ ఇన్‌స్పెక్టర్ సదానందం వద్ద ఫోన్ పే ఆర్థిక లావాదేవీలపై ఆరా తీశారు. ఫోన్ సీజ్ చేశారు. పూర్తి స్థాయి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.


