విద్యారంగ సమస్యలపై నిరంతర పోరాటం
కరీంనగర్‌టౌన్: విద్యారంగ సమస్యల పరిష్కారానికి, పోరాటాలకు విద్యార్థులు సిద్ధం కావాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు శనిగారపు రజనీకాంత్ పిలుపునిచ్చారు. ఎస్‌ఎఫ్‌ఐ 56వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం స్థానిక తెలంగాణ చౌక్ నుంచి మహాత్మ జ్యోతిరావు పూలే గ్రౌండ్ వరకు ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కులమతాలు, ప్రాంతాలకు అతీతంగా సమానమైన విద్యను అందించేందుకు ఎస్‌ఎఫ్‌ఐ నిరంతరం పోరాటాలు చేస్తుందన్నారు. జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్, ఉపాధ్యక్షులు ఆసంపల్లి వినయ్ సాగర్, గట్టు ఆకాష్, రాకేశ్, సందేశ్, మానస, సంజన, సన్నీ, అక్షయ్ తదితరులు పాల్గొన్నారు.


