భీమేశ్వరుడికి మొక్కులు
వేములవాడ: శివుడికి ప్రీతిపాత్రమైన సోమవారం భీమన్నను భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ధర్మగుండం మూసివేయడంతో భక్తులు స్నానాలు చేసేందుకు ప్రత్యేక స్నానపు గదులను రాజేశ్వరపురం వసతి గదులు కూల్చివేసిన ప్రదేశంలో ఏర్పాటు చేశారు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవమూర్తులు ప్రదక్షిణలు చేసేందుకు వీలుగా ఫ్‌లైఓవర్ బ్రిడ్జీలను తాత్కాలికంగా తొలగించనున్నారు. మహాశివరాత్రి జాతర మహోత్సవాలను చేపట్టే పనులపై జాతర సమన్వయ కమిటీ సమావేశాన్ని మంగళవారం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించనున్నారు.
భీమేశ్వరుడికి మొక్కులు


