ముగిసిన ఎస్జీఎఫ్ కరాటే టోర్నీ
కోల్‌సిటీ(రామగుండం): నగరంలోని ఆర్‌సీవోఏ క్లబ్‌లో అండర్–17 చేపట్టిన ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి కరాటే టోర్నీ, ఎంపిక పోటీలు సోమవారం ముగిశాయి. రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల నుంచి సుమారు 240 మంది బాలబాలికలు హాజరయ్యారు. ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి కనుకుంట్ల లక్ష్మణ్ నేతృత్వంలో పోటీలు నిర్వహించారు. దాసరి మల్లేశ్ పర్యవేక్షించారు. ఇన్‌చార్జి డీఈవో హనుమంతు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు కరాటే శ్రీనివాస్, వడ్డేపల్లి సురేశ్, పసునూటి శంకర్, మంధని నాగరాజు, పసునూటి చందు, శ్రావణ్ కుమార్, సుంకే రాజు, బండి పరమేశ్, పవన్, బోయపోతు రాము, అన్వేశ్ రిఫరీలుగా వ్యవహరించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోచ్, మేనేజర్లుగా ముక్తిశ్రీ, సునేహ సుల్తానా తదితరులు పాల్గొన్నారు.
జాతీయ పోటీలకు 13 మంది..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన 13 మంది క్రీడాకారులు బంగారు పతకాలు సాధించారు. వచ్చే ఏడాది జనవరిలో పుణెలో జరగనున్న జాతీయస్థాయి ఎస్‌జీఎఫ్‌ఐ పోటీలకు 13 మంది క్రీడాకారులు ఎంపికయ్యారు. బంగారు పతకాలు సాధించినవారిలో సృష్టి టుమానే, శ్రీహర్ష, శ్రీవల్లి, పి.శ్రీజ, బి.సహస్త్ర, పి.సహస్త్ర, శ్రీరాజ్ విఘ్నేశ్, టి.జయసాయిచరణ్, ఆకాశ్, డి.శివహర్షవర్ధన్, డి.దేవాన్ష్ ఉన్నారు. ముగింపు కార్యక్రమంలో గోదావరిఖని ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు డి.మాధవరావు, ప్రధాన కార్యదర్శి గడ్డం శ్యామ్‌కుమార్, కోశాధికారి రాజ్‌కుమార్, ఉపాధ్యక్షుడు కేఎస్ వాసు, రాష్ట్ర పేట అసోసియేషన్ ఉపాధ్యక్షులు కొమురోజు శ్రీనివాస్, శోభారాణి, జావిద్, విజయ్, ఖాజాభీ రమేశ్, కనకేశ్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.


