అయ్యప్ప భక్తులకు శుభవార్త
● నాందేడ్– కొల్లం ప్రత్యేక రైలు రెండు అదనపు ట్రిప్పులు
సాక్షిప్రతినిధి, కరీంనగర్: అయ్యప్ప భక్తులకు దక్షిణమధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ‘అయ్యప్పా.. ఒ కటే ట్రిప్పా?’ అనే శీర్షికన గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంతో పాటు ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు అభ్యర్థన మేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు స్పందించారు. నాందేడ్–కొల్లం ప్రత్యేక రైలును రెండు అదనపు ట్రిప్పులు నడిపేందుకు ఆదేశాలు జారీ చేశారు. జనవరి 7, 9 తేదీలలో (అప్ అండ్ డౌన్) వయా కరీంనగర్ మార్గంలో ఈ రైలు నడవనుంది. ప్రత్యేక రైలును అదనంగా రెండు ట్రిప్పులు నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే అంగీకారం తెలపడంపై పలువురు అయ్యప్ప భక్తులు ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపారు.
కరీంనగర్ అర్బన్: గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రెండోవిడత పోలింగ్ సిబ్బంది కేటాయింపు ర్యాండమైజేషన్ విధానంలో పూర్తి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఎన్నికల పరిశీలకులు వెంకటేశ్వర్లుతో కలిసి ర్యాండమైజేషన్ విధానాన్ని పరిశీలించా రు. జిల్లాలో రెండో విడతలో చిగురుమామిడి, తిమ్మాపూర్, గన్నేరువరం, మానకొండూరు, శంకరపట్నం మండలాల్లో సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయని వివరించారు. డీఆర్వో వెంకటేశ్వర్లు, జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్, నోడల్ అధికారులు పాల్గొన్నారు.
కరీంనగర్ కార్పొరేషన్: కార్మికులకు రూ.30 లక్షల బీమా కల్పించిన నగరపాలకసంస్థ కమి షనర్ ప్రఫుల్‌దేశాయ్‌కు మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ కృతజ్ఞలు తెలిపింది. గురువారం నగరపాలకసంస్థకార్యాలయంలోని ఆయన చాంబర్‌లో కలిసి పుష్పగుచ్ఛం అందించారు. గతంలో కార్మికులకు ప్రమాద బీమా చేయించాలని అనేక సార్లు వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందని యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగామ రాజమల్లు అన్నారు. కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్ రూ.30 లక్షలు బీమా కల్పించడంతో పాటు, కార్మికులకు ఇవ్వాల్సిన సబ్బులు, కొబ్బరినూనె, షూలు తదితర వస్తువులు ఇచ్చారన్నారు. జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి రవి, మహిళా కమిటీ కన్వీనర్ ముక్కెర బుజ్జమ్మ, జిల్లా కోశాధికారి దాసరి రాజమల్లయ్య, కార్పొరేషన్ కమిటీ ప్రధాన కార్యదర్శి దేవునూరి శ్యామ్‌సుందర్, డ్రైవర్ల కమిటీ నాయకులు జంగం రవీందర్, జోగు గంగయ్య, చంద్రకళ, కూర రాజు, బెజ్జంకి స్వామి, రాజు పాల్గొన్నారు.
కొత్తపల్లి(కరీంనగర్): వేసవి ప్రణాళిక సిద్ధం చేయాలని టీజీఎన్‌పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ ఎస్‌ఈ మేక రమేశ్‌బాబు సూచించారు. కరీంనగర్ సర్కిల్ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన జిల్లాస్థాయి సమీక్షలో మాట్లాడుతూ పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు ఓవర్ లోడ్ అయ్యే అవకాశం ఉన్న చోట అదనపు సామర్థ్యం ట్రాన్స్‌ఫార్మర్లు బిగించాలన్నారు. 33 కె.వీ, 11 కె.వీ. లైన్లు ఓవర్ లోడ్ అయ్యే అవకాశం ఉన్నచోట కొత్త లైన్లు ఏర్పాటు చేయాలన్నారు. వినియోదారులకు అంతరాయాలు లేకుండా 11 కె.వీ., 33 కె.వీ. లైన్ల మెయింటెనెన్స్ చేయాలన్నారు. వ్యవసాయ సర్వీస్ దరఖాస్తులను 15 రోజుల్లోపు పరిష్కరించి సర్వీస్ కనెక్షన్ ఇవ్వాలని, గృహ, వాణిజ్య మీటర్లు ఏడు రోజుల్లోపు విడుదల చేయాలని తెలిపారు. 1912 ఫోన్ ద్వారా వచ్చిన వినియోగదారుల ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సూచించారు. డీఈ (టెక్నికల్) కె.ఉపేందర్, డీఈలు జంపాల రాజం, లక్ష్మారెడ్డి, ఎం.తిరుపతి పాల్గొన్నారు.
అయ్యప్ప భక్తులకు శుభవార్త
అయ్యప్ప భక్తులకు శుభవార్త
అయ్యప్ప భక్తులకు శుభవార్త


