నచ్చజెప్పి కలిపారు
మా మధ్య ఏర్పడిన వివాదంతో పోలీస్‌స్టేషన్, కోర్టులో కేసు వేశాం. కొంతకాలంగా ఎవరికి వారుగా ఉన్నాం. జడ్జిలు, పోలీసులు నచ్చజెప్పడంతో లోక్‌అదాలత్ ద్వారా ఒక్కటయ్యాం. భార్యాభర్తల్లో ఒకరు ఎక్కువ కాదు. మరొకరు తక్కువ కాదని తెలసుకున్నాం.
– వేమల లావణ్య, మధు
పెళ్లయిన తర్వాత చిన్న గొడవకు పోలీస్‌స్టేషన్, కోర్టును ఆశ్రయించాం. గొడవలతో సాధించేది ఏమి లేదని ఇప్పుడు అర్థం అయ్యింది. లోక్ అదాలత్ ద్వారా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాం. మా తప్పులేంటో తెలిసేలా చేసి మమ్మల్ని ఒక్కటి చేశారు.
– కొత్తూరి మానస, ప్రశాంత్
ఇద్దరి మధ్య ఇగోలతో కోర్టులో కేసులు వేసుకున్నాం. ఒకరిపై మరొకరికి సరైన అవగాహన లేక, చెప్పుడు మాటలు విని కోర్టును ఆశ్రయించాం. ఇప్పుడు జడ్జిలు చెప్పిన మాట విని తిరిగి కలిసిపోతున్నాం. ఇప్పటికే ఎంతో విలువైన సమయాన్ని వృథా చేసుకున్నాం.
– అవుదారి శీరిష–శ్రీను, దంపతులు
చిన్న వివాదంతో కోర్టును ఆశ్రయించాం. అన్ని పనులు విడిచిపెట్టి వాయిదాలకు తిరుగుతూ.. మనశ్శాంతికి దూరమయ్యాం. న్యాయమూర్తులు, న్యాయవాదుల సలహాతో కేసును పరిష్కరించుకుని ఒక్కటయ్యాం. సంతోషమయ జీవితాన్ని గడుపుతాం. – తీపిరెడ్డి సుమలత–చంద్రశేఖర్, దంపతులు
నచ్చజెప్పి కలిపారు
నచ్చజెప్పి కలిపారు
నచ్చజెప్పి కలిపారు


