రజతోత్సవ సభకు తరలిరండి
తిమ్మాపూర్/గన్నేరువరం: హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈనెల 27న నిర్వహించే బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు భారీసంఖ్యలో తరలిరావాలని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పిలుపునిచ్చారు. తిమ్మాపూర్, గన్నేరువరంలో శనివారం రజతోత్సవ సభ పోస్టర్ ఆవిష్కరించారు. మానకొండూర్ నియోజకవర్గం నుంచి 10వేల మందికి పైగా తరలించాలన్నారు. తిమ్మాపూర్‌లో జరిగిన కా ర్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు రావుల రమేశ్, కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, ఉల్లెంగుల ఏకానందం, ల్యాగల వీరారెడ్డి, మాతంగి లక్ష్మ ణ్, గన్నేరువరంలో జరిగిన కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మాడుగుల రవీందర్‌రెడ్డి, బీఆ ర్‌ఎస్ మండల అధ్యక్షుడు గంప వెంకన్న, అంజనేయులు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
ఉద్యమ పార్టీ సీపీఐ
చిగురుమామిడి: కార్మిక, కర్షక,బలహీన వర్గాల కోసం ఉద్యమించిన చరిత్ర సీపీఐది అని పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. చిగురుమామిడి మండలం రేకొండ, ఓగులాపూర్, రామంచ, ముదిమాణిక్యం, సుందరగిరి, చిన్నముల్కనూర్ గ్రామాల్లో శనివారం సీపీఐ గ్రామశాఖల మహాసభలు నిర్వహించారు.చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో చిగురుమామిడి మండలంలో అత్యధిక సర్పంచ్, ఎంపీటీసీ స్థానాలు గెలుచుకోవాలని పిలుపునిచ్చారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు అందె స్వామి, బోయిని అశోక్, కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కాంతాల శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు అందె చిన్నస్వామి, చాడ శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు.
‘మనిషిని మార్చగల శక్తి కథకు ఉంటుంది’
కరీంనగర్‌కల్చరల్: సమాజంలో ఉన్న రుగ్మతలను తొలగించి మనిషిని మార్చగల శక్తి కథకు ఉందని మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల విద్యాలయాల జాయింట్ సెక్రటరీ జీవీ.శ్యామ్ ప్రసాద్ లాల్ పేర్కొన్నారు. జాతీయ సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో ప్రముఖ కథా రచయిత కటుకోజ్వల మనోహరాచారి రచించిన ‘వారధి’ కథాసంపుటిని శనివారం భగవతి విద్యానికేతన్‌లో ఆవిష్కరించారు. ముఖ్యఅతిథిగా హాజ రైన శ్యామ్ ప్రసాద్ లాల్ మాట్లాడుతూ.. కథకు సాహిత్యంలో ప్రత్యేకమైన స్థానం ఉందన్నారు. జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు గాజుల రవీందర్, బలగం నటుడు ఏలేశ్వరం సత్యం, భగవతి విద్యాసంస్థల అధినేత బి.రమణారావు, కవులు గండ్ర లక్ష్మణరావు, బెజ్జారపు వినోద్ కుమార్, స్తంభంకాడి గంగాధర్, అనంతోజు పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు.
రజతోత్సవ సభకు తరలిరండి
రజతోత్సవ సభకు తరలిరండి


