వనజీవి రామయ్యకు జిల్లాతో అనుబంధం | - | Sakshi
Sakshi News home page

వనజీవి రామయ్యకు జిల్లాతో అనుబంధం

Apr 13 2025 12:09 AM | Updated on Apr 13 2025 12:09 AM

వనజీవ

వనజీవి రామయ్యకు జిల్లాతో అనుబంధం

సిరిసిల్ల/కోనరావుపేట(వేములవాడ): వనజీవి దర్పల్లి రామయ్యతో జిల్లాకు అనుబంధం ఉంది. జిల్లాకు చెందిన ప్రకృతి ప్రేమికులు చేస్తున్న వనసంరక్షణ చర్యలను గుర్తించి జిల్లాలో పర్యటించారు. చెట్ల ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రచారం చేశారు. జిల్లాకు 2019వ సంవత్సరం జనవరి 13న వచ్చారు. కోనరావుపేట మండలం సుద్దాలకు చెందిన ప్రకృతి ప్రకాశ్‌ పర్యావరణ సేవలను గుర్తించి ఆ గ్రామానికి వచ్చారు. చెట్ల ప్రాముఖ్యతను ఆ గ్రామ పాఠశాల విద్యార్థులకు వివరించారు. జనవరి 19న సిరిసిల్ల కాలేజీగ్రౌండ్‌లో పర్యావరణ సదస్సుకు హాజరై.. మొక్కల ఆవశ్యకతను విద్యార్థులకు వివరించారు. అంతకుముందు మూడుసార్లు సిరిసిల్లకు వచ్చారు. అప్పటి కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ వనజీవి రామయ్యను సత్కరించారు. ఆయన మరణంపై పలువురు జిల్లా వాసులు సంతాపం తెలిపారు. రామయ్య మృతిపై సిరిసిల్లకు చెందిన ప్రకృతి ప్రకాశ్‌(దొబ్బల), సామాజిక సేవకుడు వేముల మార్కండేయులు సంతాపం తెలిపారు. రామయ్య మరణవార్త తెలియగానే ప్రకృతి ప్రకాశ్‌ ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి వెళ్లారు. రామయ్య మృతదేహం వద్ద నివాళి అర్పించారు.

జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటున్న జిల్లా వాసులు

రాజన్న సిరిసిల్లకు పలుమార్లు రాక

వనజీవి రామయ్యకు జిల్లాతో అనుబంధం1
1/2

వనజీవి రామయ్యకు జిల్లాతో అనుబంధం

వనజీవి రామయ్యకు జిల్లాతో అనుబంధం2
2/2

వనజీవి రామయ్యకు జిల్లాతో అనుబంధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement