● మంత్రి పొన్నం ప్రభాకర్
తిమ్మాపూర్(మానకొండూర్): రాష్ట్రంలో రోడ్డు ప్ర మాదాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొ న్నం ప్రభాకర్ అన్నారు. తిమ్మాపూర్‌లోని రవా ణా శాఖ కార్యాలయ ప్రాంగణంలో రూ.8 కోట్లతో ని ర్మించనున్న ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ భవన నిర్మాణానికి ఆదివారం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారా యణతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఏఐ టెక్నాలజీ ద్వారా వా హనాల ఫిట్‌నెస్ నిర్ధారించేందుకు ఆటోమేటెడ్ టె స్టింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నూతన స్క్రాప్ పాలసీ విధానంలో 15 ఏళ్లు దాటిన వాహనాల స్థానంలో కొత్తవి కొనుగోలు చేస్తే రాయితీ ఇస్తామని తెలిపారు. కాలుష్య నివారణకు దేశంలోనే మొదటిసారిగా ఎలక్ట్రిక్ వెహికిల్ పాలసీ తీసుకొచ్చామని పేర్కొన్నారు. రవాణా శాఖ కమిషనర్ సురేంద్రమోహన్ మాట్లాడుతూ, జిల్లాలో రోడ్ సేఫ్టీ క్లబ్బులు ప్రారంభించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తామన్నారు. కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ, ఇప్పటికే 15 స్కూళ్లకు చెందిన విద్యార్థులు ట్రాఫిక్ అవగాహన పార్కును సందర్శించారని తెలిపారు. పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ, విద్యార్థి దశ నుంచే ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన ఉంటే భవిష్యత్తులో ప్రమాదాలను నివారించవచ్చని పేర్కొన్నారు. అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్‌దేశాయ్, సంయుక్త ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్, అసిస్టెంట్ కలెక్టర్ అజయ్‌యాదవ్, ఆర్డీవో మహేశ్వర్, ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్, జిల్లా రవాణా కమిషనర్ పురుషోత్తం, డీటీవో చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.