మనిషికి ఎంతటి బాధ ఉన్నా.. మనసును ఉత్తేజపరిచే గుణం ప్రకృతిది. ఆ అందాలు చూస్తే ప్రతీఒక్కరు పులకరించాల్సిందే. మానకొండూరు మండలం ఊటూరు శివారులోని కొండలు.. కోనలు.. ఆ కొండల పక్కనే సెలయేరు (మానేరు వాగు).. దానిని ఆనుకుని ఏటిగడ్డపై పచ్చనిపైర్లు ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తున్నాయి. కరీంనగర్ మండలం చెర్లభూత్కూర్, దుర్శేడ్ శివారులో కనుచూపుమేర పచ్చని పొలాలు కళకళలాడుతూ పుడమికి ఆకుపచ్చని చీరకట్టినట్లు ఆకట్టుకుంటున్నాయి. అటువైపు వెళ్తున్న వారిని కనువిందు చేస్తున్నాయి. – మానకొండూర్/కరీంనగర్ రూరల్
మానకొండూర్ మండలం ఊటూరులో పచ్చని పైరు అందాలు
పచ్చాందాల వరి.. సిరి!
పచ్చాందాల వరి.. సిరి!