కరీంనగర్‌టౌన్: గుండె జబ్బులు ఎవరికై నా వచ్చే అవకాశం ఉందని, కేవలం నిర్లక్ష్యం కారణంగానే ఎక్కువ మంది గుండె జబ్బుల బారిన పడుతున్నారని మెడికవర్ కార్డియాలజిస్టు డాక్టర్ అనీశ్ పబ్బ అన్నారు. ఆదివారం నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో గుండె జబ్బులు.. చికిత్స..అంశంపై అవగాహన కార్యక్రమం, ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. పలువురు వాకర్స్ సందేహాలకు సమాధానాలు తెలిపారు. ఈ సందర్భంగా అనీశ్ మాట్లాడుతూ, రోజూ వాకింగ్, వ్యాయామం చేస్తున్నామని భరోసాగా ఉండే పరిస్థితి లేదన్నారు. ధూమపానం, మద్యపానం, ఫాస్ట్‌ఫుడ్, నాన్‌వెజ్ తీసుకోవడం, అధిక బీపీ, షుగర్ ఉన్న 35 ఏళ్ల పైబడినవారు రిస్క్‌లో ఉన్నట్లేనని పేర్కొన్నారు. రిస్క్ తప్పించుకోవాలంటే లైఫ్‌స్టైల్ మార్చుకొని, ఒత్తిడికి దూరంగా ఉండాలన్నారు. ఏడాదికోసారి తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. మెడికవర్ సెంటర్‌హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు నాగరాజు, వినయ్, విష్ణువర్దన్‌రెడ్డి, దిలీప్‌రెడ్డి, ఖాజామోయినొద్దీన్, రుత్విక్, రవిమల్లారెడ్డి, కోట కర్ణాకర్, సాయిచరణ్ తదితరులు పాల్గొన్నారు.