
తాహెర్‌కొండాపూర్‌లో వృద్ధుడితో ఓటు వేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
కరీంనగర్‌రూరల్: కరీంనగర్ నియోజకవర్గం పరిధిలో ఎన్నికల సంఘం వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రవేశపెట్టిన ఇంటి వద్దే ఓటింగ్ విధానం ప్రక్రియను అధికారులు గురువారం నుంచి ప్రారంభించారు. మొత్తం 390 పోలింగ్ కేంద్రాల పరిధిలో 199 మంది ఓటర్లున్నారు. వీరిలో దివ్యాంగులు 68, వయోవృద్ధులు 131 మంది ఉన్నారు. ఇంటి వద్దే ఓటేసేందుకు గురు, శుక్ర, శనివారాల్లో అవకాశం కల్పించారు. కరీంనగర్ కార్పొరేషన్, కరీంనగర్ రూరల్, కొత్తపల్లి మండలాల పరిధిలోని ఓటర్లు ఓటేసేందుకు వీలుగా మొత్తం 9 బృందాలను ఏర్పాటు చేశారు. తొలిరోజు గురువారం మొత్తం 86 మంది ఓటేయగా.. వీరిలో వయోవృద్ధులు 63, దివ్యాంగులు 23 మంది ఉన్నారని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె.మహేశ్వర్ తెలిపారు.
● తొలిరోజు 86 మందికి అవకాశం
Comments
Please login to add a commentAdd a comment