
విద్యానగర్(కరీంనగర్): భారత జాగృతికి పలువురు నాయకులు రాజీనామా చేశారు. కరీంనగర్ ప్రెస్ భవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జాగృతి నాయకులు మాట్లాడారు. తెలంగాణ మలి దశ ఉద్యమంలో తెలంగాణ జాగృతి సంస్థలో అనేక మంది పని చేశారని, జాగృతి సంస్థ ఇప్పుడు రాజకీయ పార్టీకి కొమ్ము కాస్తున్నందున ఆ సంస్థకు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. రాజీనామా చేసిన వారిలో రాష్ట్ర కార్యదర్శి సంగ్రామ్ సింగ్, నాయకులు ఛత్రపతి, అనుచోజు రవికాంత్, మామిండ్ల సుధాకర్, మేదరవేని సంపత్, వల్లెపు రఘు, తేలు మల్లేశం, శేఖర్, అనిల్, ప్రభాకర్, వినోద్ తదితరులున్నారు.
మేచినేని
నారాయణరావుకు నివాళి
కరీంనగర్: 42వ డివిజన్ కార్పొరేటర్ మేచినేని అశోక్‌రావు తండ్రి మేచినేని నారాయణరావు మరణించగా.. గురువారం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, మేయర్ వై.సునీల్‌రావు నారాయణరావు భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
నిబంధనలు అతిక్ర మిస్తే కేసులు
మానకొండూర్: అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంతంగా జరుపుకోవాలని కరీంనగర్ రూరల్ ఏసీసీ కరుణాకర్‌రావు అన్నారు. గురువారం మండల కేంద్రంలో కేంద్ర బలగాలు, పోలీసులతో ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ మాట్లాడారు. ప్రజలు శాంతియుతంగా మెలగాలని, గొడవలకు దూరంగా ఉండాలన్నారు. ఎన్నికల నిబంధనలకు విరుద్దంగా ప్రవర్తిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. వివిధ పార్టీల కార్యకర్తలు, నాయకులు బైండోవర్‌కు సహకరించాలన్నారు. ఈకార్యక్రమంలో సీఐలు రాజ్‌కుమార్, ఇంద్రసేనారెడ్డి, ఎస్సైలు శ్రీకాంత్, ప్రమోద్‌రెడ్డి, పోలీసు సిబ్బంది, మండలంలోని ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న రూరల్ ఏసీపీ