కామారెడ్డి టౌన్: భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సెల్ కో కన్వీనర్‌గా జిల్లా కేంద్రానికి చెందిన 44వ వార్డు కౌన్సిలర్ జి. ప్రీతి జైన్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర సాంస్కృతిక సెల్ కన్వీనర్ నాగపురి రాజమౌళి గౌడ్ ఆదివారం నియామక ఉత్తర్వులను జారీచేశారు. జిల్లా నుంచి ప్రీతి జైన్‌కు రాష్ట్రస్థాయి పదవి దక్కడంపై బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆమెకు అభినందనలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, సాంస్కృతిక విభాగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తానని ఆమె తెలిపారు.
● యానంపల్లి వద్ద ఒకరి మృతి
● పలువురికి గాయాలు
డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): మండలంలోని యానంపల్లి గ్రామ శివారులో ఆదివారం
గుంతను తప్పించే క్రమంలో వాహనాలు వరుసగా ఢీకొన్నాయి. ఈఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.పలువురికి గాయాలయ్యాయి. స్థానికులు, డిచ్‌పల్లి ఎస్సై ఎండీ ఆరీఫ్ తెలిపిన వివరాలు .. యానంపల్లి గ్రామానికి చెందిన జయ్య నవీన్ తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి బైక్‌పై డిచ్‌పల్లి వైపు బయలుదేరాడు. అదే సమయంలో మెంట్రాజ్‌పల్లి గ్రామానికి చెందిన గుర్రపు కిషన్ (46) తన బైక్‌పై సుద్దులం నుంచి తన గ్రామానికి వెళ్తున్నాడు. బాలికల గురుకుల పాఠశాల సమీపంలో రోడ్డుపై గుంతను తప్పించడానికి ముందు వెళుతున్న నవీన్ సడన్‌బ్రేక్ వేశాడు. ఈక్రమంలో వెనకే వస్తున్న కిషన్ బైక్ అతడిని ఢీకొనగా, రెండు బైక్‌లు కొంతదూరం రాసుకుపోయాయి. అదే సమయంలో రామడుగు గ్రామానికి చెందిన నీరడి ప్రదీప్ తన భార్య, కొడుకుతో కలిసి బైక్‌పై సుద్దపల్లి వైపు నుంచి తన గ్రామానికి వెళ్తున్నాడు. దీంతో నవీన్ వాహనం తగిలి ప్రదీప్ వాహనం కూడా అదుపుతప్పి రోడ్డుపై పడిపోయారు. ఈఘటనలో కిషన్ అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే నవీన్, ప్రదీప్‌తోపాటు వారి కుటుంబీకులకు గాయాలయ్యాయి. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
గాంధారి : మండల పరిధిలోని పోతంగల్ కలాన్ శివారు బుగ్గగండి అడవిలో గల బుగ్గరామేశ్వరాలయంలో శనివారం రాత్రి చోరీ జరిగింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిపిన వివరాలు.. ఆలయ పూజారి స్వామినాథన్ ఆదివారం ఉదయం గుడి తలుపులు తెరిచి ఉండటంతో చోరీ జరిగినట్లు గుర్తించాడు. రెండు హుండీలు ధ్వంసమై, అందు లోని కానుకలు, నగదు అపహరణకు గురైనట్లు గ మనించాడు. పూజారి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై ప్రకాశ్ తెలిపారు.
లింగంపేట : మండలంలోని ఎక్కపల్లితండా శివారులో ఆదివారం పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు పేకాట స్థావరంపై దాడి చేసి ముగ్గురు పేకాట రాయుళ్లను పట్టుకున్నట్లు ఎస్సై దీపక్‌కుమార్ పేర్కొన్నారు. వారివద్ద నుంచి రూ. 2975, మూడు ఫోన్లు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


