శివాజీ విగ్రహావిష్కరణ | - | Sakshi
Sakshi News home page

శివాజీ విగ్రహావిష్కరణ

Aug 31 2026 1:20 AM | Updated on Aug 31 2026 1:20 AM

ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మండలం మత్తమాల గ్రామంలో ఆదివారం ఛత్రపతి శివాజీ మహరాజ్‌ విగ్రహాన్ని బీజేపీ రాష్ట్ర నాయకులు పైడి ఎల్లారెడ్డి ఆవిష్కరించారు. నేటి యువత శివాజీని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. నియోజకవర్గంలో 150 శివాజీ విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు.అలాగే బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం రాజులు మాట్లాడారు. జిల్లా ప్రధాన కార్యదర్శి గరిడె రవీందర్‌ రావు, స్థల దాత పటోళ్ల రాంగోపాల్‌ రెడ్డి, అధ్యాత్మిక వక్త అనసూయారెడ్డి, గ్రామస్తులు, యువకులు, నియోజకవర్గ బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలి

నాగిరెడ్డిపేట : విద్యార్థుల ఫీజు బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు పేర్కొన్నారు. గోపాల్‌పేటలో ఆదివారం బీజేపీ రాష్ట్రకార్యవర్గ సభ్యులు పైడి ఎల్లారెడ్డితో కలిసి ఆయన పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పార్టీ కార్యాలయాలను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. దీంతోపాటు రాష్ట్రంలో మొదటి బీజేపీ శాసనసభ్యునిగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యేను గెలిపించుకుంటామని ఆయన చెప్పారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, జిల్లా ఉపాధ్యక్షుడు రాజ్‌మోమాన్‌రెడ్డి, దేవెందర్‌రెడ్డి, మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌, సర్పంచ్‌ భాస్కర్‌, నాయకులు హాన్మాండ్లు, కొండ మీరాతాయి, బాలయ్య, దేవిసింగ్‌, శ్రీకాంత్‌, నరేందర్‌రెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement