పారదర్శకంగా ‘సర్‌’ | - | Sakshi
Sakshi News home page

పారదర్శకంగా ‘సర్‌’

Jul 10 2026 7:58 AM | Updated on Jul 10 2026 7:58 AM

కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌

కామారెడ్డి క్రైం: జిల్లాలో జరుగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్‌–2026) ప్రక్రియను పారదర్శకంగా నిష్పాక్షికంగా నిర్వహిస్తున్నామని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ తెలిపారు. వివిధ రాజకీయ పార్టీల నాయకు లతో కలెక్టరేట్‌లో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఇ ప్పటికే ఎన్యుమరేషన్‌ ఫారాల పంపిణీ పూర్తయ్యిందని, ప్రస్తుతం డిజిటలైజేషన్‌ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోందని వివరించారు. రాజకీయ పార్టీల నాయకు లు తమ బీఎల్‌ఏల ద్వారా ప్రజలకు ‘సర్‌’ ప్రక్రియపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా సర్వే గడువును పొడిగించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులు కలెక్టర్‌ను కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు విక్టర్‌, గిరి, తహసీల్దార్‌ హిమబిందు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement