కామారెడ్డి టౌన్ : జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందతున్న వైద్య సేవలు, ఎదురవుతున్న సమస్యలను ప్రజలు నేరుగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌వో) వెంకట్ దృష్టికి తీసుకెళ్లడం కోసం ‘సాక్షి’ దినపత్రిక ఈనెల 10న ఫోన్ ఇన్ నిర్వహిస్తోంది. ప్రజలు తమ సమస్యలను వివరించి, సీజనల్ వ్యాధులపై తగిన సలహాలు, సూచనలు పొందవచ్చు.
తేది : 10–07–2026 (శుక్రవారం)
సమయం: ఉదయం 9:30 నుంచి 10:30 గంటల వరకు..
ఫోన్ చేయాల్సిన నంబర్: 7416834389


