ఎమ్మెల్యే కేవీఆర్‌పై మూడు కేసుల కొట్టివేత | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే కేవీఆర్‌పై మూడు కేసుల కొట్టివేత

Jun 25 2026 5:41 AM | Updated on Jun 25 2026 5:41 AM

ఎమ్మెల్యే కేవీఆర్‌పై మూడు కేసుల కొట్టివేత దరఖాస్తుల ఆహ్వానం

కామారెడ్డి టౌన్‌ : కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డిపై గతంలో నమోదైన మూ డు క్రిమినల్‌ కేసులను హైదరాబాద్‌ నాంపల్లి లోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం బుధవారం కొట్టివేసింది. వెంకటరమణారెడ్డి న్యాయవాదులు ఎల్‌.ప్రభాకర్‌రెడ్డి, వై.రాము లు, టి.ఉదయ్‌ రాజ్‌ తెలిపిన వివరాలిలా ఉ న్నాయి. మున్సిపల్‌ పట్టణ ప్రతిపాదిత మాస్టర్‌ ప్లాన్‌కు వ్యతిరేకంగా 2023లో స్థానిక రైతులు, పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రజల ఆస్తులు, రైతుల భూములు, హక్కుల పరిరక్షణ కోసం చేపట్టిన ఆందోళనల్లో కేవీఆర్‌ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో కామారెడ్డి పోలీస్‌ స్టేషన్‌లో ఆయనపై మూడు కేసులు నమోదయ్యాయి. వాటిని సమగ్రంగా పరిశీలించిన న్యాయస్థానం అభియోగాలను కొనసాగించేందుకు తగిన ఆధారాలు లేవంటూ వాటిని కొట్టివేసిందని న్యాయవాదులు తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన ఆందోళనల్లో పాల్గొనడాన్ని నేరంగా పరిగణించలేమని పేర్కొందన్నారు.

కామారెడ్డి అర్బన్‌: కరీంనగర్‌లోని ప్రభుత్వ అంధుల ఆశ్రమ పాఠశాల(తెలుగు, ఇంగ్లిష్‌ మీడియం)లో ప్రవేశం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్‌ భాస్కర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నామని పేర్కొన్నారు. ఉమ్మడి కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, హైదరాబాద్‌, వరంగల్‌ జిల్లాల అంధ బాలబాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు 97011 90124 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement