పథకాన్ని సద్వినియోగం చేసుకోండి..
● పేద విద్యార్థుల కోసం విదేశీ
విద్యా నిధి పథకం
● విదేశాలలో చదువుకోవాలనుకునే
పేద విద్యార్థులకు ఈ పథకం వరం
ఎల్లారెడ్డి: విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలనుకునే పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విదేశీ విద్యా నిధి పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. విదేశీ విద్యానిధి పథకం కింద ఎంపికై న నిరుపేద విద్యార్థులకు రూ.20 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేస్తారు. అమెరికా, జర్మనీ, ఆస్ట్రేలియా, కెనడా, దక్షిణ కొరియా, సింగపూర్, జపాన్, న్యూజీలాండ్, ఫ్రాన్స్, లండన్ వంటి దేశాల్లో చదువుకోవాలనుకునే పేద విద్యార్థులకు ఈ పథకం వరం. తెలంగాణాలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పేరిట, బీసీ, ఈబీసీ, మైనారిటీ విద్యార్థులకు మహాత్మా జ్యోతిబా పూలే ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పేరిట ఈ పథకాన్ని అమలు చేస్తోంది
ఈ పథకం పొందేందుకు అర్హతలు..
● అభ్యర్థి కుటుంబ వార్షికాదాయం రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల లోపు ఉండాలి.
● కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన కోర్సు పూర్తి చేసి ఉండాలి.
● పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీహెచ్‌డీ, ఎంబీబీఎస్ వంటి ఉన్నత విద్యను చదువుకోవాలకునే విద్యార్థులు అర్హులు
● జీఆర్‌ఈ, జీమాట్, ఐఈఎల్‌టీఎస్, టోఫెల్‌లో అర్హత మార్కులు సాధించి ఉండాలి.
కావాల్సిన ముఖ్యమైన పత్రాలు...
● ఆధార్ కార్డు, కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు
● డిగ్రీ వరకు విద్యార్హత సర్టిఫికెట్లు
● పాస్‌పోర్ట్ కాపీ
● విదేశీ యూనివర్సిటీలలో అడ్మిషన్ లెటర్
● జీఆర్‌ఈ, జీమాట్, ఐఈఎల్‌టీఎస్, టోఫెల్ స్కోర్ కార్డులు
● బ్యాంక్ పాస్‌బుక్ మొదటి పేజి జిరాక్స్ కాపీ
విద్యానిధి పథకానికి గడువు తేది..
తెలంగాణ ప్రభుత్వం విద్యానిధి పథకం కోసం సంవత్సరానికి రెండు సార్లు(స్ప్రింగ్ అండ్ ఫాల్ సీజన్లకు) దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఎస్సీ ఎస్టీ విద్యార్థుల కోసం అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పేరిట మార్చి 31 వరకు గడువు తేదీగా నిర్ణయించింది. ఇక జ్యోతిబా పూలే ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌ల పేరిట బీసీ, ఈబీసీ, మైనారిటీ విద్యార్థులకు దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్ట్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు గడువుగా నిర్ణయించింది.
విదేశాలలో ఉన్నత విద్యాభ్యాసం చేయాలనుకునే పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం సంక్షేమశాఖ ద్వా రా ఈ పథకాన్ని అమలు చేస్తోంది. అర్హత గల వి ద్యార్థులు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలి.
– పల్లె నర్సయ్య,
జిల్లా బీసీ సంక్షేమ అధికారి, కామారెడ్డి


