విద్యార్థుల అడ్మిషన్లు పెంచాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల అడ్మిషన్లు పెంచాలి

Jun 25 2026 5:41 AM | Updated on Jun 25 2026 5:41 AM

లింగంపేట(ఎల్లారెడ్డి): లింగంపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో విద్యార్థుల సంఖ్య పెంచాలని అధ్యాపకులకు ఇంటర్‌ జిల్లా నోడల్‌ అధికారి షేక్‌ సలామ్‌ సూచించారు. బుధవారం ఆయన లింగంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కళాశాలలో తరగతి విద్యా బోధన, డిజిటల్‌ తరగతులను పరిశీలించారు. అలాగే మొదటి సంవత్సరంలో జరుగుతున్న అడ్మిషన్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కళాశాలలో జరుగుతున్న మరమ్మతులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రిన్సిపాల్‌ నరేందర్‌, అధ్యాపకులు శివ, దుర్గయ్య, ధర్‌సింగ్‌, రాజయ్య, స్వామిగౌడ్‌, హైమద్‌, శ్రీలత, సంధ్య, ఆనంద్‌రెడ్డి తదితరులున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement