డ్రగ్స్‌ రహిత సమాజాన్ని నిర్మిద్దాం | - | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ రహిత సమాజాన్ని నిర్మిద్దాం

Jun 25 2026 5:41 AM | Updated on Jun 25 2026 5:41 AM

పోలీస్‌ కమిషనర్‌ సాయి చైతన్య

బోధన్‌టౌన్‌(బోధన్‌): మాదక ద్రవ్య రహిత సమాజాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని పోలీస్‌ కమిషనర్‌ సాయిచైతన్య పిలుపునిచ్చారు. ‘మనబడి– మన భద్రత’ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని ఇందూర్‌ మోడల్‌ హైస్కూల్‌లో బుధవారం మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సీపీ మాట్లాడుతూ.. ఈ నెల 26వ తేదీన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. డ్రగ్స్‌, అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు. లేని పక్షంలో డయల్‌ ఈగల్‌ ఫోర్స్‌ టోల్‌ ఫ్రీ నంబర్‌ 1908కు ఫోన్‌ చేయాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారు చేసిన తప్పుకు ఎదుటి వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడంతోపాటు వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ యాంటి డ్రగ్స్‌ సోల్జర్‌గా మారి సమాజంలో అవగాహన కల్పించాలన్నారు. అనంతరం యాంటి డ్రగ్స్‌ సోల్జర్‌ సెల్ఫీపాయింట్‌ను ప్రారంభించారు. డ్రాయింగ్‌, వ్యాసరచన పోటీల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement