గాంధారి మండల ఉప సర్పంచ్‌ ఫోరం కార్యవర్గం ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

గాంధారి మండల ఉప సర్పంచ్‌ ఫోరం కార్యవర్గం ఎన్నిక

Jun 25 2026 5:41 AM | Updated on Jun 25 2026 5:41 AM

గాంధారి(ఎల్లారెడ్డి): మండల ఉప సర్పంచ్‌ల ఫోరం కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఫోరం అధ్యక్షుడిగా ఎన్నికై న గాంధారి ఉప సర్పంచ్‌ కె. భాస్కర్‌ గౌడ్‌ తెలిపారు. ఉపాధ్యక్షుడిగా బామన్‌ అనంతరావు, ప్రధాన కార్యదర్శిగా ప్రవీణ్‌ నాయక్‌, సంయుక్త కార్యదర్శిగా మంజ గోపాల్‌, మహ్మద్‌ అబ్దుల్‌, కోశాధికారిగా చిన్న సాయిలును ఎన్నుకున్నట్లు తెలిపారు.

లింగంపేట కార్యవర్గం..

లింగంపేట(ఎల్లారెడ్డి): లింగంపేట మండల ఉపసర్పంచుల ఫోరం నూతన కార్యవర్గాన్ని బుధవారం స్థానిక రామాలయంలో ఎన్నుకున్నారు. ఎల్లారెడ్డి నియోజక వర్గ అధ్యక్షుడు ప్రసాద్‌గౌడ్‌ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. అధ్యక్షుడిగా మన్నె బాలయ్య(శెట్పల్లి), ఉపాధ్యక్షులుగా మామిడి సంజీవులు(అయిలాపూర్‌), మాసన్నగారి కిష్టయ్య(సజ్జన్‌పల్లి), ప్రధాన కార్యదర్శిగా సంద బాలయ్య(పోతాయిపల్లి), వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా రమావత్‌ పీర్యా(కొట్టాల్‌గడ్డ తండా), కోశాధికారిగా కలాలు బాలాగౌడ్‌(మెంగారం), కార్యదర్శులుగా బిట్ల రాజు(ముస్తాపూర్‌), కల్లు రాజు(జల్దిపల్లి)లను ఎన్నుకున్నట్లు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement