ఘనంగా చండీ హోమం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా చండీ హోమం

Jun 25 2026 5:41 AM | Updated on Jun 25 2026 5:41 AM

భిక్కనూరు: మండలంలోని కాచాపూర్‌ గంగమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలు మూడు రోజులుగా కొనసాగుతున్నాయి. బుధవారం ప్రతిష్ఠాపన ఉత్సవాల్లో భాగంగా ఆలయం ప్రాంగణంలో పెద్ద ఎత్తున చండీ హోమం నిర్వహించారు. తదుపరి పూర్ణాహుతి నిర్వహించి పెద్ద ఎత్తున తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. 26 వరకు ఉత్సవాలను నిర్వహిస్తామని, భక్తులు ఈ కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావల్సిందిగా నిర్వాహకులు కోరారు.

నేడు వరుణ జప అనుష్ఠానం

కామారెడ్డి అర్బన్‌: బ్రాహ్మణ వికాస పరిషత్‌ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం 6 గంటలకు కామారెడ్డి సిరిసిల్ల రోడ్డులోని శ్రీత్రిశక్తి ఆలయంలో వరుణ జప అనుష్ఠానం నిర్వహించనున్నట్లు వికాస పరిషత్‌ అధ్యక్షుడు సీహెచ్‌ అర్జున్‌రావు తెలిపారు. భక్తులు వరుణ జప అనుష్టానం కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని అర్జున్‌రావు కోరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement