మక్కల కొనుగోళ్లను వేగవంతం చేయండి | - | Sakshi
Sakshi News home page

మక్కల కొనుగోళ్లను వేగవంతం చేయండి

May 17 2026 1:18 AM | Updated on May 17 2026 1:18 AM

కామారెడ్డి క్రైం: యాసంగి సీజన్‌కు సంబంధించిన మక్కల కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ అధికారులను ఆదేశించారు. జిల్లాలో కొనసాగుతున్న మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియపై శనివారం తన చాంబర్‌లో అధికారులతో సమీక్షించారు. హమాలీల సంఖ్యను పెంచి, కొనుగోలు చేసిన మక్కలను ప్రతిరోజూ గిడ్డంగులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే గుర్తించిన గోదాములను వెంటనే స్వాధీనం చేసుకుని వినియోగంలోకి తీసుకురావాలని గిడ్డంగుల సంస్థ అధికారులకు సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ విక్టర్‌, జిల్లా సహకార, మార్కెటింగ్‌, సివిల్‌ సప్లయ్‌, రవాణా శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement