‘వన్‌ మినట్‌ రూల్‌’ పాటించాలి | - | Sakshi
Sakshi News home page

‘వన్‌ మినట్‌ రూల్‌’ పాటించాలి

May 17 2026 1:18 AM | Updated on May 17 2026 1:18 AM

హెడ్‌ కానిస్టేబుళ్లకు స్టేషన్ల కేటాయింపు

కామారెడ్డి అర్బన్‌ : విద్యుత్‌ సిబ్బంది భద్రతకు తొలి ప్రాధాన్యత ఇస్తూ ‘వన్‌ మినట్‌ రూల్‌’ అమలు చేస్తున్నామని విద్యుత్‌ శాఖ జిల్లా ఎస్‌ఈ సాలియా నాయక్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ‘ఒక నిమిషం ఆలోచన – జీవితాంతం భద్రత’ అనే సందేశంతో ప్రత్యేక భద్రత విధానం తీసుకువచ్చామని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది పనిచేసే ముందు ఒక నిమిషం సమయం తీసుకుని భద్రతా ప్రమాణాలను సమగ్రంగా పరిశీలించడం ఈ ‘వన్‌ మినట్‌ రూల్‌’ ఉద్దేశమని తెలిపారు. లైన్‌ క్లియర్‌ (ఎల్‌సీ), ఇండక్షన్‌ టెస్టర్‌తో లైన్‌లో విద్యుత్‌ సరఫరా లేదని పరీక్షించడం, వ్యక్తిగత రక్షణ పరికరాలు, ఎర్తింగ్‌ వ్యవస్థ, ఇతర ప్రమాదాలను అంచనా వేయడం, డబుల్‌ ఫీడింగ్‌ జరగకుండా చర్యలు, బృందంలోని సిబ్బందిని అప్రమత్తంగా ఉంచడం, పరికరాల సురక్షిత పరిశీలన లాంటివి ఈ రూల్‌లో ఉంటాయని పేర్కొన్నారు. సిబ్బంది తప్పనిసరిగా దీనిని పాటించాలని ఆదేశించారు.

20న మెడికల్‌ షాపుల బంద్‌

కామారెడ్డి టౌన్‌ : ఈనెల 20న దేశవ్యాప్తంగా మెడికల్‌ షాపుల బంద్‌ నిర్వహించనున్నట్లు కామారెడ్డి మెడికల్‌, రిటైల్‌, హోల్‌సెల్‌ అ సోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు కేశవ్‌, వంశీకృష్ణ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలో బంద్‌కు సంబంధించిన వాల్‌ పోస్టర్ల ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్‌లో మందుల అమ్మకాలను ప్రోత్సహిస్తుండడం వల్ల తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందన్నా రు. కోవిడ్‌ సమయంలో ఆన్‌లైన్‌ ద్వారా మందుల అమ్మకాలపై కేంద్ర ప్రభుత్వం ఇ చ్చిన ఆదేశాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలోని ఫార్మసీ యాజమాన్యాలు, కెమిస్ట్‌లు అందరూ బంద్‌లో పా ల్గొనాలని కోరారు. అసోసియేషన్‌ ప్రతినిధు లు ప్రభాకర్‌, మారుతి, శ్రీ నివాస్‌, లోకేష్‌, పాత రాజు తదితరులు పాల్గొన్నారు.

అదనపు డీఆర్డీవోగా కుటుంబరావు

కామారెడ్డి క్రైం: అదనపు డీఆర్డీవోగా కుటుంబరావు నియమితులయ్యారు. ఆయన హైదరాబాద్‌నుంచి బదిలీపై వచ్చారు. శనివారం బాధ్యతలు చేపట్టిన అనంతరం కలెక్టర్‌ ఆశి ష్‌ సంగ్వాన్‌ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

18 నుంచి ‘యూత్‌

అండ్‌ స్పోర్ట్స్‌ థీమ్‌’

కామారెడ్డి అర్బన్‌: ప్రజాపాలన –ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భాగంగా ఈనెల 18 నుంచి 23 వరకు కామారెడ్డిలో ‘యూత్‌ అండ్‌ స్పోర్ట్స్‌ థీమ్‌’ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని జిల్లా యువజన క్రీడల అధికారి రంగా వెంకటేశ్వరగౌడ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. క్రీడలపై ఆసక్తి, నా యకత్వ లక్షణాల పెంపు, సామాజిక భద్ర త, ఉద్యోగ అవకాశాల కల్పన అంశాలపై అవగాహన కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా 18న టు కే మారథన్‌ రన్‌, 19న కెరీర్‌, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం, 20న యువతకు నాయకత్వ లక్షణాలపై అవగాహన, 21న స్పోర్ట్స్‌ డే, 22న యువత శ్రమదానం, స్వచ్ఛ కార్యక్రమాలు, 23న ఉద్యోగ సాధన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. యువత పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.

కామారెడ్డి క్రైం: హెడ్‌ కానిస్టేబుళ్లుగా పదో న్నతి పొంది కరీంనగర్‌, సిరిసిల్ల జిల్లాల నుంచి వచ్చిన తొమ్మిది మందికి శనివారం కౌన్సెలింగ్‌ నిర్వహించారు. జిల్లా పోలీస్‌ కా ర్యాలయంలో ఎస్పీ రాజేశ్‌ చంద్ర ఆధ్వర్యంలో కార్యక్రమం సాగింది. సర్వీస్‌ రికార్డు, ఆ రోగ్య పరిస్థితులు లాంటి అన్ని రకాల అంశాలను పరిగణనలోకి తీసుకుని వారికి వివిధ పోలీస్‌ స్టేషన్‌లలో పోస్టింగ్‌లు ఇచ్చినట్లు ఎ స్పీ తెలిపారు. ఏఎస్పీ నరసింహారెడ్డి, పోలీ స్‌ అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement