● డ్రైవర్ దుర్మరణం
కామారెడ్డి క్రైం: ప్రమాదవశాత్తు డివైడర్‌ను ఢీకొని డీసీఎం వ్యాన్ బోల్తా పడి న ఘటనలో డ్రైవర్ దు ర్మరణం పాలయ్యా డు. ఈ ఘటన కామారెడ్డి కలె క్టరేట్ ఎదురుగా జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. వివరాలిలా ఉన్నాయి. గాంధారికి చెందిన సుప్పని నవీన్ (30) డీసీఎం డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. మక్కల లోడ్‌ను అన్‌లోడ్ చేసుకొని హైదరాబాద్ వైపు నుంచి గాంధారి వైపు తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు డీసీఎం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ప్రమాదంలో నవీన్ అక్కడికక్కడే మృతి చెందాడు. దేవునిపల్లి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ జరిపారు. మృతుడికి ఇంకా పెళ్లి కాలేదు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


