క్రీడలతో మానసిక ఉల్లాసం | - | Sakshi
Sakshi News home page

క్రీడలతో మానసిక ఉల్లాసం

May 17 2026 1:18 AM | Updated on May 17 2026 1:18 AM

తాడ్వాయి(ఎల్లారెడ్డి): క్రీడలు ఆడటం వల్ల మానసిక ఉల్లాసం కలగడమే కాకుండా ఆరోగ్యంగా ఉంటారని సర్పంచ్‌ సొంటికే మల్లవ్వ అన్నారు. ఎర్రాపహాడ్‌లో శనివారం ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా వాలీబాల్‌ టోర్నమెంటు పోటీలు ప్రారంభించారు. ఆటలో గెలుపు ఓటములు సహజమని, ఓడిన వారు నిరుత్సాహపడకుండా, మళ్లీ గెలవడానికి ప్రయత్నించాలన్నారు. సర్పంచ్‌ మల్లవ్వ, ఉప సర్పంచ్‌ ప్రభాకర్‌రెడ్డి, బీఎంసీ చైర్మన్‌ నరసింహారెడ్డి, వీడీసీ చైర్మన్‌ మోహన్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు రాజలింగం, జలంధర్‌రెడ్డి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement