ఎరువుల విక్రయ కేంద్రానికి తాళం | - | Sakshi
Sakshi News home page

ఎరువుల విక్రయ కేంద్రానికి తాళం

May 13 2026 1:02 AM | Updated on May 13 2026 1:02 AM

రుద్రూర్‌: తమకు అవసరం లేకున్నా నానో యూరియాను ఎరువులతోపాటు బలవంతంగా అంటగడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పొతంగల్‌ విశాల సహకార సంఘం పరిధిలోని హెగ్డొలిలో ఎరువుల విక్రయ కేంద్రానికి రైతులు మంగళవారం తాళం వేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గతంలో తీసుకున్న నానో యూరియా లిక్విడ్‌ ఇంకా మిగిలి ఉండగానే మళ్లీ కొనాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. మూడు సంచుల ఎరువులు తీసుకుంటే ఒక లిక్విడ్‌ బాటిల్‌ తప్పనిసరిగా తీసుకోవాలని నిబంధన విధించడంతో నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఎరువులు, పురుగుమందుల ధరలు పెరిగిపోయాయని, ఇలాంటి పరిస్థితుల్లో అదనపు భారం మోపడం తగదన్నారు. వ్యవసాయాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement