ఎలా గడపాలని ఆలోచించా..
తెలంగాణ సామెతలు
మోర్తాడ్(బాల్కొండ): వేసవి సెలవులంటే కాలక్షేపం కోసం కాదు.. ఏదో ఒక కళలో ప్రావీణ్యం పొందేందుకు సద్వినియోగం చేసుకోవాలని నిరూపిస్తున్నారు ఈ చిన్నారులు. ఆ చిన్నారులను తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారు మోర్తాడ్‌కు చెందిన సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ శ్రీహర్షిణి. చిన్నారులకు మన సంస్కృతి గొప్పతనాన్ని తెలియజెప్పేందుకు కూచిపూడి నృత్యంలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. అందివచ్చిన అవకాశాన్ని స్థానిక చిన్నారులు సద్వినియోగం చేసుకుంటున్నారు.
ఎంసీఏ చదివిన శ్రీహర్షిణి నాంది ఫౌండేషన్, మహేంద్ర ప్రైడ్ సంస్థల ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యార్థులకు సాఫ్ట్ స్కిల్స్‌లో ట్రైనర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. మరోవైపు నృత్యశిక్షకురాలిగా రాణిస్తున్నారు. తాను నేర్చుకున్న విద్యను పదిమందికి నేర్పాలనే ఉద్దేశంతో మోర్తాడ్‌లో వేసవి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. వివిధ గ్రామాలకు చెందిన 12 మంది విద్యార్థులు ఈనెల ఒకటో తేదీ నుంచి ప్రారంభమైన శిక్షణ తరగతుల్లో పాల్గొంటున్నారు. ఈనెలాఖరు వరకూ శిక్షణ తరగతులను కొనసాగిస్తానని శ్రీహర్షిణి తెలిపారు. ఒక అబ్బాయికి క్లాసికల్ డ్యాన్స్‌లో ఒక గంట పాటు ప్రత్యేక శిక్షణ కొనసాగిస్తుండటం గమనార్హం. సెలవులను కాలక్షేపం కోసం కాకుండా నృత్య శిక్షణతో సద్వినియోగం చేసుకుంటున్న ఈ చిన్నారులు ఎంతో మందికి స్పూర్తి అని చెప్పొచ్చు.
● మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అయినట్లు
(ఎక్కువ మంది జోక్యం చేసుకుంటే పని సరైన దారిలో సాగకుండా గందరగోళంగా మారుతుంది.)
● సిగ్గులేదా జీడి గింజా అంటే..
నల్లగున్నా నాకేమి సిగ్గు అనిందట.
(తన తప్పును లేదా లోపాన్ని సమర్థించుకుంటూ,
ఏమాత్రం సిగ్గు పడకుండా ఎదురు సమాధానం చెప్పడం)
వేసవి సెలవులను వృథా కానివ్వడం లేదు. నృత్యంలో శిక్షణ పొందడానికి సెలవులను సద్వినియోగం చేసుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. మా తల్లితండ్రులు, మా శిక్షకురాలు ఇచ్చే ప్రోత్సాహంతో ముందుకు సాగుతాం. – హన్విక, దొన్కల్
మోర్తాడ్‌లో మేము పొందుతున్న నృత్య శిక్షణ ఎంతో బాగుంది. వేసవి సెలవులను ఎలా గడపా లని ఆలోచించాం. మోర్తాడ్‌లో శిక్షణ ఇస్తున్నట్లు తెలియగానే మా తల్లిదండ్రులు శిక్షణ తరగతులకు పంపిస్తున్నారు.
– విహాన్షి, రామన్నపేట్
కూచిపూడి నృత్యంలో
శిక్షణ పొందుతున్న చిన్నారులు
కళలో ప్రావీణ్యానికి
సెలవులు సద్వినియోగం
సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్‌గా రాణిస్తూనే
నృత్య శిక్షణ ఇస్తున్న శ్రీహర్షిణి
మోర్తాడ్‌లో ప్రతిరోజూ
వేసవి శిక్షణ తరగతులు


