వైభవంగా పెద్దమ్మకు బోనాలు | - | Sakshi
Sakshi News home page

వైభవంగా పెద్దమ్మకు బోనాలు

May 13 2026 1:02 AM | Updated on May 13 2026 1:02 AM

వైభవంగా పెద్దమ్మకు బోనాలు ఉపాధి కూలీల సంఖ్య పెంచాలి విద్యా వారోత్సవాల్లో యోగ, ధ్యానం గడ్డి విరాళం ఘనంగా నర్సు దినోత్సవం హిజ్రాల రాకపై నిషేధం

లింగంపేట(ఎల్లారెడ్డి): పర్మళ్లలో మంగళవారం పెద్దమ్మకు గ్రామస్తులు బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా ముదిరాజ్‌ కులస్తులు, గ్రామస్తులు ఇంటింటికి బోనాలు తీసుకొని గ్రామంలోని ప్రధాన వీధుల్లో డప్పువాయిద్యాలు, శివసత్తుల పూనకాలతో ఊరేగించారు. అనంతరం పెద్దమ్మ ఆలయం చుట్టూ ఐదుసార్లు ప్రదక్షిణలు చేసి అమ్మవారికి సమర్పించారు. ప్రత్యేక పూజలు చేశారు. మొక్కులు తీర్చుకున్నారు.

ఎల్లారెడ్డిరూరల్‌: గ్రామాలలో ఉపాధి కూలీల సంఖ్య పెంచాలని ఫీల్డ్‌ అసిస్టెంట్లకు ఎంపీడీవో తాహేరాబేగం సూచించారు. బ్రాహ్మణపల్లిలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను మంగళవారం ఆమె పరిశీలించారు. కూలీలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని సిబ్బందికి సూచించారు. ఏపీవో వినోద్‌, సిబ్బంది తదితరులున్నారు.

కామారెడ్డి అర్బన్‌: విద్యా వారోత్సవాల్లో భాగంగా మంగళవారం కామారెడ్డి ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో యోగ, ధ్యానం నిర్వహించారు. యోగా గురువు నగేష్‌ను ప్రిన్సిపల్‌ కె.విజయ్‌కుమార్‌, అధ్యాపకులు, సిబ్బంది సన్మానించారు.

భిక్కనూరు: దక్షిణ కాశీగా పేరొందిన భిక్కనూరు సిద్దరామేశ్వరాలయానికి మల్లుపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డి, రాంరెడ్డిలు మంగళవారం రెండు ట్రాక్టర్ల గడ్డిని సోమవారం విరాళంగా అందజేశారు. ఆలయ పునర్‌నిర్మాణకమిటీ చైర్మన్‌ లింబాద్రి, డైరెక్టర్‌ నీల అంజయ్య వారికి కృతజ్ఞతలు తెలిపారు.

బాన్సువాడ: అంతర్జాతీయ నర్సు దినోత్సవాన్ని మంగళవారం బీర్కూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. కేక్‌ కట్‌ చేసి వైద్య సిబ్బందికి పంచిపెట్టారు. ఈ సందర్భంగా నర్సుల సేవల గురించి వివరించారు. వైద్యులు సౌజన్య, సూపర్‌వైజర్‌ సుశీల, నర్సమ్మ, సిబ్బంది ప్రీతి, శ్రీలత తదితరులున్నారు.

నందిపేట్‌(ఆర్మూర్‌): మండలంలోని చౌడమ్మ కొండూరు గ్రామంలోకి హిజ్రాల రాకను నిషేధిస్తూ గ్రామాభివృద్ధి కమిటీ మంగళవారం నిర్ణయం తీసుకుంది. గ్రామంలో పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాల సమయంలో హిజ్రాలు వచ్చి వేలాది రూపాయలు డిమాండ్‌ చేస్తున్నారని, బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, వారి అంగీకారం మేరకు హిజ్రాల ఆగడాలను శాశ్వతంగా అరికట్టేందుకు గ్రామాభివృద్ధి కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై హిజ్రాలను గ్రామంలోకి రానివ్వొద్దని తీర్మానించారు. కార్యక్రమంలో వీడీసీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement