క్రైం కార్నర్‌ | - | Sakshi
Sakshi News home page

క్రైం కార్నర్‌

May 13 2026 1:02 AM | Updated on May 13 2026 1:02 AM

ఉరేసుకొని ఒకరి ఆత్మహత్య ఇసుక లారీల పట్టివేత

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి

జక్రాన్‌పల్లి/నిజామాబాద్‌ రూరల్‌: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. జక్రాన్‌పల్లి మండలం అర్గుల్‌కు గ్రామానికి చెందిన జైడి పెద్దోళ్ల నర్సయ్య (70) మంగళవారం 44వ నంబర్‌ జాతీయ రహదారి దాటుతుండగా.. కామారెడ్డి వైపు నుంచి ఆర్మూర్‌ వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. గాయాలపాలైన నర్సయ్యను చికిత్స నిమిత్తం ఆర్మూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేశ్‌ తెలిపారు.

బైక్‌ను లారీ ఢీట్టిన ఘటనలో తాపిమేస్త్రి..

నిజామబాద్‌ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గూపన్‌పల్లి క్రాసింగ్‌ వద్ద బైక్‌ను లారీ ఢీట్టిన ఘటనలో తాపిమేస్త్రి మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. నగరంలోని హస్మీ కాలనీకి చెందిన షేక్‌ షాకీర్‌(28) మాక్లూర్‌ మండల బోర్గాం(కే)లో మేస్త్రి పని చేస్తుంటాడు. మంగళవారం మధ్యాహ్నం పని పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా ఎప్పటిలాగే మంగళవారం ఉదయం బోర్గాం(కే) గ్రామంలో మేస్త్రి పని పూర్తయిన అనంతరం మధ్యాహ్నం తిరిగి వస్తుండగా గూపన్‌పల్లి క్రాసింగ్‌ బైక్‌ను లారీ ఢీకొట్టగా షాకీర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి షబ్బీర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్‌ ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్‌ తెలిపారు.

కామారెడ్డి క్రైం: భార్యతో గొడవల కారణంగా మనస్థాపానికి గురైన భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్‌ కాలనీలో మంగళవారం చోటు చేసుకుంది. మహ్మద్‌ హుస్సేన్‌ (35) కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో ప్రతి రోజూ భార్యతో గొ డవలు జరిగేవి.కొద్ది రోజుల క్రితం అతడి భార్య గౌసియా బేగం పిల్లలతో కలిసి హైదారాబాద్‌లోని తన తల్లిగారింటికి వెళ్లిపోయింది. కామారెడ్డికి రావాలని హుస్సేన్‌ పలుమార్లు అడిగినా ఆమె రాకపోవడంతో మనస్థాపానికి గురై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌హెచ్‌వో నరహరి తెలిపారు.

ఆర్మూర్‌టౌన్‌: అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలను ఆర్మూర్‌, మోర్తాడ్‌లో చీత ఫోర్స్‌ మెరుపుదాడులు నిర్వహించి మంగళవారం పట్టుకుంది. అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న రెండు భారీ లారీలను సీజ్‌ చేసి స్థానిక పోలీసులకు అప్పగించారు.

Advertisement
 
Advertisement
Advertisement