నిజామాబాద్ రూరల్: నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మంగళవారం ఉదయం బాలుడు మృతి చెందాడు. జక్రాన్‌పల్లి మండలం పడకల్ తండాకు చెందిన బదావత్ లత, నరేశ్ దంపతులు తమ కుమారుడు నిక్షిత్(16 నెలలు) ఆరోగ్యం బాగా లేకపోవడంతో సోమవారం ఉదయం ఆస్పత్రికి తీసుకువచ్చారు. పరీక్షించిన వైద్యుడు మందులు రాసిచ్చి ఇంటికి పంపించారు. పరిస్థితి మెరుగుకాకపోవడంతో రాత్రి వేళ మళ్లీ బాబును ఆస్పత్రికి తీసుకురాగా, ఆస్పత్రి సిబ్బంది అడ్మిట్ చేసుకున్నారు. చికిత్స ప్రారంభించి సైలెన్‌లు పెట్టారు. అయినప్పటికీ ఆరోగ్యం కుదుటపడకపోవడంతో మంగళవారం ఉదయం స్కానింగ్‌కు రిఫర్ చేశారు. స్కానింగ్ చేయించి బాబును ఆస్పత్రికి తీసుకు వచ్చిన కొద్దిసేపటికి మృతి చెందాడు. వైద్యుడి నిర్లక్ష్యం కారణంగానే తమ బాబు మృతి చెందాడని తల్లిదండ్రులతోపాటు వారి బంధువులు ఆందోళనకు దిగారు. ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి సిబ్బందితో కలిసి ఆస్పత్రికి చేరుకుని వారిని సముదాయించారు.
● వైద్యుల నిర్లక్ష్యమే కారణమని
కుటుంబ సభ్యుల ఆరోపణ
● ఆస్పత్రి ఎదుట ఆందోళన


