హిందుత్వం అంటే సంస్కృతి | - | Sakshi
Sakshi News home page

హిందుత్వం అంటే సంస్కృతి

May 13 2026 12:56 AM | Updated on May 13 2026 12:56 AM

భగవద్గీతలో ప్రతి సమస్యకు పరిష్కారం

బీకేఎస్‌ రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు అంజిరెడ్డి

భిక్కనూరు: హిందుత్వం అంటే మతం ఒక్కటే కాద ని, సంస్కృతి సంప్రదాయాలని భారతీయ కిసాన్‌ సంఘ్‌ రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు అంజిరెడ్డి పేర్కొన్నా రు. మంగళవారం జంగంపల్లిలో హిందూ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మా ట్లాడుతూ భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడి భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. భగవద్గీత ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతుందన్నారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా భ గవద్గీతను చదవాలని, గో సంరక్షణ, దేవాలయ ప రిరక్షణకు కృషి చేయాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నతనం నుంచే ఆచార వ్య వహరాలు, సంస్కృతీ సంప్రదాయాలను నేర్పించాలన్నారు.

హిందువులు ఐక్యంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని ఇస్కాన్‌ కామారెడ్డి జిల్లా ప్రతినిధి వెంకటదాసు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో రోజూ గంట పాటు దైవనామస్మరణకు సమయాన్ని కేటాయించుకోవాలని సూచించారు. మహిళలు తలచుకుంటే సాధించలేనిది ఏమీ లేదని రామాయంపేట సేవికా సమితి ప్రతినిధి కవిత పేర్కొన్నారు. అహిల్యాబాయి, జిజియా మాతల్లా ఆదర్శంగా జీవించాలన్నారు. కార్యక్రమంలో కుషాల్‌ మనోహర్‌, కార్తీక్‌ మనోహర్‌ భగవద్గీత శ్లోకాలు, సామూహిక హనుమాన్‌ చాలీసా, వందే మాతర గీతం ఆలపించారు. కార్యక్రమంలో సమ్మేళనం అధ్యక్షుడు ప్రశాంత్‌, ప్రధాన కార్యదర్శి బాలకృష్ణాగౌడ్‌, కోశాధికారి మోహన్‌రెడ్డి, సర్పంచ్‌ శ్రీవాణి వాసు యాదవ్‌, నాయకులు సిద్దరాములు, నర్సింలు యాదవ్‌, నాగరాజు, శ్రీనివాస్‌, శేఖర్‌గౌడ్‌, నవీన్‌, సంజీవ్‌, దేవేందర్‌, సూర్యప్రకాశ్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement