‘జాతీయ రహదారిపై బస్టాండ్‌ ఏర్పాటు చేయాలి’ | - | Sakshi
Sakshi News home page

‘జాతీయ రహదారిపై బస్టాండ్‌ ఏర్పాటు చేయాలి’

May 13 2026 12:56 AM | Updated on May 13 2026 12:56 AM

కామారెడ్డి టౌన్‌ : జిల్లా కేంద్రంలో జాతీయ ర హదారి పక్కన బస్టాండ్‌ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయమై ఆయన మంగళవారం హైదరాబాద్‌లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ని జామాబాద్‌, ఆర్మూర్‌ తదితర డిపోలనుంచి దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులు చాలా వరకు బైపాస్‌ మీ దుగా ప్రయాణిస్తున్నాయని, పట్టణంలోకి రావడం లేదని పేర్కొన్నారు. దీంతో బస్సులకోసం పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పట్టణానికి సమీపంలో జాతీయ రహదారికి ఆనుకుని ప్ర భుత్వ భూములు ఉన్నందున హైవే బస్టాండ్‌ ఏర్పా టు చేయాలని కోరారు. తమ వినతిపై మంత్రి సా నుకూలంగా స్పందించి బస్టాండ్‌ ఏర్పాటు అంశా న్ని పరిశీలించాలని ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ను ఆదేశించారని తెలిపారు. ఆయన వెంట మున్సిపల్‌ కౌ న్సిలర్‌ గడ్డ మీది మహేశ్‌, డీసీసీ ఉపాధ్యక్షుడు ని మ్మ విజయ్‌కుమార్‌రెడ్డి, క్రెడా అధ్యక్షుడు లక్ష్మీనర్సా గౌడ్‌, కాంగ్రెస్‌ నేత శ్రీధర్‌రావు తదితరులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement