కామారెడ్డి టౌన్ : కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేయా లని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఆయన తన పదవిని అడ్డుపెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ మంగళవారం జిల్లా కేంద్రంలోని ఇందిరా చౌక్ వద్ద కాంగ్రెస్ నేతలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేయగా.. పోలీసులు వారిని అ డ్డుకున్నారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సందీప్ మాట్లాడుతూ బండి సంజయ్ తన కుమారుడు భగీరథపై నమోదైన పోక్సో కేసును నీ రుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆ యన పదవిలో ఉంటే నిష్పక్షపాత దర్యాప్తు జరగదన్నారు. వెంటనే భగీరథను అరెస్ట్ చేయాలని డి మాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్‌రెడ్డి, నాయకులు గోనె శ్రీనివాస్, రాజాగౌడ్, రామాగౌడ్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.


