చిత్రకళతో సృజనాత్మకత | - | Sakshi
Sakshi News home page

చిత్రకళతో సృజనాత్మకత

May 11 2026 8:38 AM | Updated on May 11 2026 8:38 AM

తెలంగాణ సామెతలు ఇస్కాన్‌ సంస్కృతి శిక్షణ శిబిరం

బొమ్మలు గీయడం ఇష్టం

ఉత్సాహంగా నేర్చుకుంటున్నారు..

బోధన్‌లో మూడేళ్లుగా

వేసవి ప్రత్యేక శిక్షణ శిబిరం

బోధన్‌: చిత్రలేఖనమంటే బొమ్మలు గీయడ మే మాత్రమే కాదు.. మనస్సుతో మాట్లాడే భా ష అని చిత్రకారులంటున్నారు. తమ ఊహాశక్తితో పౌరాణిక, జానపద, ప్రకృతి దృశ్యాలను అద్భుతంగా చిత్రీకరిస్తారు. చిత్రలేఖనం పిల్ల ల్లో ఏకాగ్రతను పెంపొందించడంతోపాటు సృజనాత్మకతకు పదును పెడుతుంది. సాలూర మండల కేంద్రానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు లింబూరు లక్ష్మణ్‌ తేజ క్రియేటివ్‌ కిడ్స్‌ డ్రాయింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆధ్వర్యంలో మూడేళ్లుగా బోధన్‌ పట్టణంలో వేసవి చిత్రలేఖన ప్ర త్యేక శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. చిన్నారుల్లో సృజనాత్మకతను వెలికితీసే ఉద్దేశంతో ఈ ఏడాదీ శిబిరం ప్రారంభమైంది. ప్రస్తుతం శిబిరంలో 15 మందికి పైగా విద్యార్థులు చిత్రలేఖనంలో మెలకువలు నేర్చుకుంటూ అద్భుత ప్రతిభ చాటుతున్నారు. పట్టణ కేంద్రానికి చెందిన ప్రముఖ చిత్రకారిణి ఎర్రొల్ల అవంతి విద్యార్థులకు బోధిస్తున్నారు. పెన్సిల్‌ డ్రాయింగ్‌, షేడింగ్స్‌, కలర్‌ పెయింటింగ్‌, హ్యాండ్‌ రైటింగ్‌ అంశాలపై శిక్షణ ఇస్తున్నారు.

కామారెడ్డి అర్బన్‌: హరేరామ హరేకృష్ణ ఇస్కాన్‌ ఆధ్వర్యంలో నేటి నుంచి ఈ నెల 24 వరకు సంస్కృతి వేసవి శిబిరం నిర్వహిస్తున్నట్టు ఇస్కాన్‌ కామారెడ్డి కేంద్రం ప్రతినిధి వెంకటదాసు ప్రభు ఒక ప్రకటనలో తెలిపారు. భగవద్గీత శ్లోకాలు, తబలా, చిత్రలేఖనం, నైతిక, పౌరాణిక, నీతి కథలు, ధ్యానం, కీర్తనలు, నృత్యం, రుచికర సహజ వంటల తయారీ అంశాలపై శిక్షణ ఉంటుందన్నారు. ఆసక్తిగల 5 నుంచి 15 ఏళ్లలోపు విద్యార్థులు రామారెడ్డి రోడ్డు లోని మెడికల్‌ అసోసియేషన్‌ భవనంలోని ఇస్కాన్‌ కేంద్రంలో లేదా 99129 16108, 99596 02551 నంబర్లకు సంప్రదించవచ్చన్నారు.

మేము గీసిన చిత్రాలు

ఇంటి కోడికి ఒకటే కాలు..

పొరుగు కోడికి మూడు కాళ్లు

( మన దగ్గర ఉన్నదాని కన్నా పక్కవాడికి ఉన్నదే గొప్పగా భ్రమపడటం)

గాడిద సోపతి తన్నులకే..

( చెడ్డవాళ్లతో, మూర్ఖులతో స్నేహం చేస్తే మంచి కాకుండా నష్టం, అవమానం, ఇబ్బందులు వస్తాయి.)

నాకు బొమ్మలు గీయడమంటే ఎంతో ఇష్టం. మూ డో తరగతి నుంచి బొమ్మ లు గీయడంపై ఆసక్తి పెంచుకున్నాను. ఇంటి వద్దనే బొమ్మలు గీసేదానిని. బోధన్‌లో వేసవి ప్రత్యేక శిక్షణ శిబిరం ఏర్పాటైనట్లు తెలుసుకొని నేను, తమ్ముడు చేరాం. ప్రతి రోజు వచ్చి డ్రాయింగ్‌ నేర్చుకుంటున్నాం.

– భవ్య, 7వ తరగతి విద్యార్థిని, బోధన్‌

డ్రాయింగ్‌ నేర్చుకునేందుకు పిల్లలు ఉత్సాహం చూపుతున్నారు. బొమ్మలు గీయడం ఎంతో సులభమో విద్యార్థులకు మెలకువలు నేర్పుతున్నాం. రంగులపై అవగాహన కల్పిస్తూ, విద్యార్థులు సొంతంగా బొమ్మలు గీసేలా ప్రొత్సహిస్తున్నాం.

– ఎర్రొల్ల అవంతి, ప్రముఖ చిత్రకారిణి

Advertisement
 
Advertisement
Advertisement