క్రైం కార్నర్‌ | - | Sakshi
Sakshi News home page

క్రైం కార్నర్‌

May 11 2026 8:38 AM | Updated on May 11 2026 8:38 AM

అనుమానాస్పద స్థితిలో ఒకరు..

పాముకాటుతో మహిళ మృతి

నవీపేట : మండలంలోని ధర్మారం(ఎ) గ్రామానికి చెందిన పల్లపు నర్సమ్మ(57) పాముకాటుతో మృతి చెందినట్లు ఎస్సై శ్రీకాంత్‌ ఆదివారం తెలిపారు. శనివారం రాత్రి కుటుంబసభ్యులతో భోజనం చేశాక ఆరుబయట పడుకుందని పేర్కొన్నారు. రాత్రి సమయంలో కట్లపాము కాటువేయగా 108 అంబులెన్స్‌లో జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారని తెలిపారు. మృతురాలి సోదరి సావిత్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

బాన్సువాడ రూరల్‌: మండలంలోని కొల్లూర్‌ గ్రామానికి చెందిన బండారి సాయిలు(48) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఎదుట మొరందుబ్బ ప్రాంతంలో సాయిలు ఉరేసుకొని మృతి చెందాడనే సమాచారం మేరకు పోలీసులు పరిశీలించారు. రెండు రోజుల క్రితమే చనిపోయినట్లు గుర్తించారు. మృతుడి భార్య సుశీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడా? ఎవరైనా హత్య చేసి చెట్టుకు వేలాడదీశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

చెట్టును ఢీకొన్న బైక్‌

ఒకరి మృతి

ఆర్మూర్‌టౌన్‌: చెట్టును ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన ఆర్మూర్‌ మండలం గోవింద్‌పేట్‌ శివారులో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై యాసిర్‌ ఆర్ఫాత్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్‌ జిల్లా పాపన్నపేట్‌ గ్రామానికి చెందిన సీతానగర్‌ దాకయ్య(50) గోవింద్‌పేట్‌ గ్రామంలో కొన్ని సంవత్సరాలుగా కూలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో పనుల నిమిత్తం గోవింద్‌పేట్‌ గ్రామం నుంచి ఆర్మూర్‌కు వస్తుండగా గ్రామ శివారులో ద్విచక్రవాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో దాకయ్య అక్కడిక్కడే మృతిచెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement