యువతకు పెరిగిన ప్రాధాన్యత
● మండలాలు, పట్టణాల అధ్యక్షుల నియామకం
● కార్యవర్గాల ఏర్పాటే ఆలస్యం
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : కాంగ్రెస్‌ను క్షేత్ర స్థాయి లో బలోపేతం చేసే దిశగా ఆ పార్టీ నాయకత్వం చ ర్యలు తీసుకుంటోంది. మొదట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని, తర్వాత జిల్లా కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఇటీవల మండల, పట్టణ అధ్యక్షుల నియమక ప్రక్రియ చేపట్టారు. జిల్లాలో బాన్సువాడ ని యోజకవర్గం మినహా మిగతా అన్ని మండలాలు, పట్టణ అధ్యక్షుల నియామక ప్రక్రియ పూర్తయ్యింది.
ఆయా నియోజకవర్గాల పార్టీ ఇన్‌చార్జీల సూచనల కు అనుగుణంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఏలె మ ల్లికార్జున్ మండలాలు, పట్టణాల పార్టీ అధ్యక్షుల నియామక ప్రక్రియ నిర్వహించారు. చాలా వరకు యువతకు అవకాశాలు కల్పించారు. మూడేళ్లకుపైగా అధ్యక్షులుగా కొనసాగుతున్న వారిని దాదాపు తప్పించి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇ చ్చారు. కామారెడ్డి పట్టణ అధ్యక్షుడిగా చాలా కాలంగా పనిచేస్తున్న పండ్ల రాజును తప్పించారు. ఆయ న స్థానంలో ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు ఐరేని సందీప్‌ను నియమించారు. కామారెడ్డి మండలానికి దశాబ్దకాలానికిపైగా అధ్యక్షుడిగా కొనసాగిన గూ డెం శ్రీనివాస్‌రెడ్డి స్థానంలో ధర్మగౌని రాజాగౌడ్‌ను అధ్యక్షుడిని చేశారు. మాచారెడ్డి, పాల్వంచ మండలాల అధ్యక్షులుగా నౌసీలాల్, రమేశ్‌గౌడ్‌లను రెండో పర్యాయం కొనసాగించారు. బీబీపేట మండల అధ్యక్షుడిగా పనిచేసిన సుతారి రమేశ్‌ను తప్పించి, ఆయన స్థానంలో భిక్కనూరు ఏఎంసీ చైర్మన్ పాత రాజుకు అవకాశం ఇచ్చారు. భిక్కనూరుకు నరేందర్‌రెడ్డి, రాజంపేటకు అంకం కృష్ణారావ్‌ను నియ మించారు.
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎల్లారెడ్డి మండల అ ధ్యక్షుడిగా కుర్మ సాయిబాబా, నాగిరెడ్డిపేటకు శ్రీధర్‌గౌడ్, లింగంపేటకు గొల్ల సాయిరాం యాదవ్, సదాశివనగర్‌కు మహీపాల్‌రెడ్డి, తాడ్వాయికి సంజీవులు, రామారెడ్డికి ప్రవీణ్‌గౌడ్, గాంధారికి శ్రీని వాస్ నియమితులయ్యారు.
జుక్కల్ మండల అధ్యక్షుడిగా రమేశ్ దేశాయ్, నిజాంసాగర్‌కు ప్రజాపండరి, మహ్మద్‌నగర్‌కు రవీందర్‌రెడ్డి, పిట్లంకు రవీందర్, పెద్దకొడప్‌గల్‌కు శ్యామప్ప, మద్నూర్‌కు సాయిలు, డోంగ్లీకి గజానన్, బిచ్కుందకు నాగనాథ్, బిచ్కుంద పట్టణానికి విజయభాస్కర్‌రెడ్డి అధ్యక్షులయ్యారు.
బాన్సువాడ పట్టణంతో పాటు బాన్సువాడ, నస్రుల్లాబాద్, బీర్కూర్ మండలాలకు పార్టీ అధ్యక్షులను నియమించలేదు. ఆయా మండలాలకు సైతం త్వరలోనే నియామక ప్రక్రియ పూర్తి చేసే అవకాశాలున్నాయి. త్వరలోనే పూర్తి స్థాయి పట్టణ, మండల కార్యవర్గాలనూ ఏర్పాటు చేయడానికి కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
జిల్లాలోని ఆయా మండలాలు, పట్టణాల్లో అ ధ్యక్షుల నియామకంలో యువతకు ప్రాధాన్య తనిచ్చారు. పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడానికి చాలాచోట్ల యువకులను అవకా శం ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీ సుకువెళ్లి క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చే యడానికి యువ రక్తానికి ప్రాధాన్యతనిచ్చిన ట్టు తెలుస్తోంది. జిల్లా అధ్యక్షుడు మొదలు, మండల, పట్టణ అధ్యక్షులు చాలావరకు యువకులే ఉన్నారు. జిల్లాలో కాంగ్రెస్‌ను మరింత బ లోపేతం చేయడమే లక్ష్యంగా పార్టీ మండల, పట్టణ అధ్యక్షులను నియమించినట్లు డీసీసీ అధ్యక్షుడు ఏలె మల్లికార్జున్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. బాన్సువాడకు సంబంధించిన నియామకాలు కూడా త్వరలోనే పూర్తి చేస్తామన్నారు.


