నేటి నుంచి 17 వరకు విద్యా వారోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి 17 వరకు విద్యా వారోత్సవాలు

May 11 2026 7:32 AM | Updated on May 11 2026 7:32 AM

కామారెడ్డి అర్బన్‌: ప్రజాపాలన –ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా కామారెడ్డి ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో ఈనెల 11 నుంచి 17 వరకు విద్యా వారోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపల్‌ విజయ్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. వారోత్సవాల్లో భాగంగా మౌలిక సదుపాయాల కల్పన, వసతులు, శిక్షణ కార్యక్రమాలు, తల్లిదండ్రుల సమావేశం, విద్యా ప్రమాణాలపై చర్చ, గ్రంథాలయ దినోత్సవం, డిజిటల్‌ విద్యపై అవగాహన, విద్యార్థులకు బహుమతుల ప్రదానం కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. కార్యక్రమాలను విజయవంతం చేయాలని విద్యార్థులను కోరారు.

13 నుంచి ఉచిత క్రికెట్‌ శిక్షణ శిబిరం

కామారెడ్డి అర్బన్‌:/కామారెడ్డి టౌన్‌ : కామారెడ్డి క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో 13న ఉచిత వేసవి క్రికెట్‌ శిబిరాన్ని ప్రారంభించ నున్నట్లు అసోసియేషన్‌ అధ్యక్షుడు మోజా మ్‌ అలీఖాన్‌, కార్యదర్శి ముప్పారపు ఆనంద్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకేంద్రంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో హైదరాబాద్‌, నిజామాబాద్‌ క్రికేట్‌ అసోసియేషన్‌ సహకారంతో ఈ శిబిరాన్ని నిర్వహించనున్నామని పేర్కొన్నారు. రోజూ ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు శిక్షణ ఉంటుందని తెలిపారు. 12 ఏళ్ల నుంచి 25 ఏళ్లలోపు బాల, బాలికలు, యువతీయువకులు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని, 13న నేరుగా స్టేడియానికి వచ్చి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో పతకాల పంట

కామారెడ్డి అర్బన్‌: హనుమకొండలోని జేఎన్‌ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి అథ్లె టిక్స్‌ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తాచాటారు. మహిళల విభాగంలో కే.మేఘన జా వెలిన్‌ త్రోలో బంగారు పతకం, షాట్‌పుట్‌ లో కాంస్య పతకం సాధించగా, వై.శిరీష జా వెలిన్‌ త్రోలో కాంస్య పతకం పొందారు. అండర్‌–20 బాలుర విభాగంలో లాంగ్‌ జంప్‌ లో నందు, రాకేష్‌ వెండి పతకాలు, పవన్‌ క ళ్యాణ్‌ కాంస్య పతకం సాధించారు. అండర్‌–18 బాలికల విభాగం 400 మీటర్ల ప రుగులో కె.నందిని వెండి పతకం పొందారు. విజేతలను జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జైపాల్‌రెడ్డి, అనిల్‌కుమార్‌ అభినందించారు.

‘బెల్ట్‌ షాపులు నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తాం’

కామారెడ్డి అర్బన్‌: జిల్లాలో మద్యం బెల్ట్‌ షాపులు నిర్వహిస్తే చట్టప్రకారం కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎకై ్సజ్‌ అధికారి హన్మంతురావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఇటీవలి కాలంలో బెల్ట్‌ షాపులు నిర్వహిస్తున్న వారిపై 91 కేసులు నమోదు చేసి బాధ్యులైన 90 మందిని అరెస్ట్‌ చేశామని పేర్కొన్నారు. అక్రమంగా మద్యం విక్రయించే పనిని మానుకోవాలని సూచించారు.

నేడు ‘కోఆప్షన్‌’ ఎన్నిక

బిచ్కుంద: బిచ్కుంద మున్సిపల్‌ కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక సోమవారం జరుగనుంది. నలుగురు కోఆప్షన్‌ సభ్యులను ఎన్నుకోనున్నారు. 12 వార్డులు ఉండగా 10 మంది కాంగ్రెస్‌ కౌన్సిలర్లు, ఇద్దరు బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు ఉన్నారు. కాంగ్రెస్‌ నుంచి 8 మంది కోఆప్షన్‌ కోసం నామినేషన్లు వేశారు. ఉదయం 11 గంటలకు మున్సిపల్‌ కార్యాలయంలో ఎన్నిక నిర్వహించనున్నారు. మైనార్టీ విభాగం నుంచి అసద్‌అలీ, పర్వీన్‌ అబ్దుల్‌, జనరల్‌లో చింతల హన్మండ్లు, బొగడమీది తానుబాయిలకు కోఆప్షన్‌ సభ్యులుగా ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు అవకాశం కల్పిస్తున్నారని కాంగ్రెస్‌ నాయకులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement