● పత్తాలేని కొనుగోలు కేంద్రాలు
● పట్టించుకోని అధికారులు
● ఆందోళనలో రైతులు
తెల్గాపూర్‌లో జొన్న కుప్పలు
నిజాంసాగర్ : జొన్న రైతులకు మద్దతు కరువవుతోంది. పంట పూర్తిగా చేతికివచ్చినా కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సర్కారు చర్యలు తీసుకోకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. త్వరగా కొనుగోళ్లు చేపట్టాలని కోరుతున్నారు.
యాసంగి సీజన్‌లో జిల్లావ్యాప్తంగా 86 వేల ఎకరాల్లో జొన్న పంట సాగయ్యింది. ఈసారి వరికి బదులుగా చాలా మంది జొన్న సాగు చేశారు. బాన్సువాడ, బిచ్కుంద, జుక్కల్, మద్నూర్, డోంగ్లి, పిట్లం, పెద్దకొడప్‌గల్, నిజాంసాగర్, మహమ్మద్‌నగర్, ఎల్లారెడ్డి, లింగంపేట, గాంధారి మండలాల్లో ఈ పంట ఎక్కువగా సాగయ్యింది. ఆయా మండలాల్లో సాగు చేసిన జొన్న పంట నూర్పిడీలు పూర్తై నెల రోజులు కావస్తోంది.
కానీ ఇంతవరకు జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాల వద్దకు తెచ్చి కుప్పలుగా పోసిన రైతులు.. కొనుగోళ్ల కోసం నిరీక్షిస్తున్నారు.


