నేటి నుంచి జనగణన! | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి జనగణన!

May 11 2026 7:32 AM | Updated on May 11 2026 7:32 AM

తొలి దశలో కుటుంబాల గుర్తింపు

జిల్లాలో 1,954 మంది

ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లు

పూర్తయిన స్వీయగణన ప్రక్రియ

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : దేశవ్యాప్తంగా జరిగే జనగణన ప్రక్రియ సోమవారం నుంచి మొదలుకానుంది. ఈ ప్రక్రియ నిర్వహించేందుకు ఇప్పటికే ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లను నియమించి వారికి వివిధ దశల్లో శిక్షణ ఇచ్చారు. జనగణనలో తొలి దశలో కుటుంబాల గుర్తింపు చేపట్టనున్నారు. సోమవారం ప్రారంభమయ్యే జనగణన తొలి దశ ప్రక్రియ జూన్‌ 9 వరకు కొనసాగనుంది. మొదట జిల్లాలో కుటుంబాల లెక్క తేలుస్తారు. జిల్లా యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. జనగనణ కోసం 1,954 మంది ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లను నియమించారు. గణనకు అవసరమైన మెటీరియల్‌ అందించారు. సోమవారం నుంచి వారికి కేటాయించిన ప్రాంతాల్లో తిరిగి కుటుంబాల గుర్తింపు ప్రక్రియ చేపడతారు. కాగా స్వీయగణన ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. దాదాపు 10 వేల మంది స్వీయగణన చేసుకున్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement