కాల్వలకు మరమ్మతులు చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

కాల్వలకు మరమ్మతులు చేపట్టాలి

May 10 2026 7:40 AM | Updated on May 10 2026 7:40 AM

ఇరిగేషన్‌ అధికారులకు

ప్రజాప్రతినిధుల సూచన

పలు మండలాల్లో నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో ‘రైతు వారం’ నిర్వహణ

లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని శెట్పల్లి, అయ్యపల్లి, అయ్యపల్లి తండాల శివారులో గత వర్షాకాలంలో భారీ వర్షాలకు ధ్వంసమైన చెరువు కట్టలు, కట్టు కాల్వల మరమ్మతులు త్వరితగతిన చేపట్టాలని ఆయా గ్రామాల సర్పంచులు ఇరిగేషన్‌ అధికారులకు సూచించారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో శనివారం ఇరిగేషన్‌ శాఖ ఆధ్వర్యంలో ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ‘రైతు వారం’ నిర్వహించారు. ఈసందర్భంగా ఆ యా గ్రామాల సర్పంచులు తమ గ్రామాల సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చారు. ఇప్పటికే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఆయా గ్రామాల్లో దెబ్బతిన్న చెరువులు, ఫీడర్‌ చానల్‌లకు నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు. సర్పంచులు అట్టెం శ్రీనివాస్‌, గోనె లింగం, ఆత్మ కమిటీ చైర్మన్‌ ధశరత్‌నాయక్‌, ఏవో అనిల్‌కుమార్‌, ఇరిగేషన్‌ ఏఈ సతీష్‌కుమార్‌, రైతులు తదితరులు పాల్గొన్నారు.

మాచారెడ్డి మండలంలో..

మాచారెడ్డి: చెరువుల్లో పూడిక తీత పనులు చేపట్టాలని ఇరిగేషన్‌ ఏఈ వంశీ కృష్ణ అన్నారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం గజ్యానాయక్‌ తండా రైతు వేదికలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. చెరువులలో పూడిక తియ్యడం, ముళ్ల పొదలు తొలగించడం, నీటిని సమృద్ధిగా వాడడం వంటి పనులు చేపట్టాలన్నారు. ఆయా గ్రామాల స ర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులున్నారు.

ఎల్లారెడ్డి మండలంలో..

ఎల్లారెడ్డిరూరల్‌: పోచారం ప్రాజెక్టు నీరు చివరి ఆయకట్టు వరకు అందించడంలో అధికారుల పనితీరు అభినందనీయమని ఎల్లారెడ్డి మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రజిత అన్నారు. మండలంలోని మీసాన్‌పల్లి రైతు వేదికలో నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో ‘రైతు వారోత్సవాలు’ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో పుష్కలంగా వర్షాలు కురవడంతో రెండు పంటలు సాగు కావడంతో రైతులు ఆనందంగా ఉన్నారన్నారు. సొసైటీ చైర్మన్‌ ఏగుల నర్సింలు, నీటి పారుదల శాఖ ఏఈ రాజేష్‌, రైతులు తదితరులున్నారు.

భూసార పరీక్షలు చేయించుకోవాలి

పెద్దకొడప్‌గల్‌(జుక్కల్‌): ప్రతి రైతు భూసార పరీక్షలు చేయించుకోవాలని ఏవో కిషన్‌ తెలిపారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో శనివారం ప్ర జా పాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా ‘రైతు వా రోత్సవాలు’ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. ప్రతి రైతు భూసార పరీక్షలు చేయించుకొని, దానికి అనుగుణంగానే ఎరువులు ఉపయోగించాలని సూచించారు. నాయకులు బస్వరాజ్‌ దేశాయ్‌,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement