భిక్కనూరు: మండల కేంద్రంలోని అంగడి బజారులో ఈనెల 11న జరిగే హిందూ సమ్మేళనానికి ప్రజలు తరలిరావాలని సమ్మేళన నిర్వాహకులు కోరారు. భిక్కనూరులో శనివారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. హిందూ సమ్మేళనం ప్రధాన వక్తగా సామాజిక సమరసత వేదిక, తెలంగాణ ప్రాంత కన్వీనర్ అప్పాల ప్రసాద్, ఆశీ ప్రసంగిక్‌గా మెట్‌పల్లి గీతా కేంద్రం విశోక తీర్థ స్వామిజీ హాజరవుతారన్నారు. అధ్యక్షుడు చల్ల లక్ష్మన్, ప్రధాన కార్యదర్శి లింగా రాజబాబుగౌడ్, కోశాధికారి పెద్దబచ్చుగారి చంధ్రశేఖర్, ప్రతినిదులు గొల్ల రమేష్, సందుగారి రవీందర్‌రెడ్డి, విలాస్‌రెడ్డి, బల్యాల వెంకటనర్సింలు,జేపి సిద్దాగౌడ్ తదితరులు ఉన్నారు.
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలోని నందివాడ గ్రామంలో శనివారం సింగిల్‌విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని తాడ్వాయి సింగిల్ విండో చైర్మన్ నల్లవెల్లి కపిల్‌రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు జంగం మంగారెడ్డి, సంకు పోచయ్య, డైరెక్టర్లు సంజీవరెడ్డి, రాజిరెడ్డి, గ్రామపెద్దలు, రైతులు పాల్గొన్నారు.
భిక్కనూరు : అనారోగ్యంతో మృతి చెందిన తాతకు మనుమరాలు తలకొరివి పెట్టిన ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. మండల కేంద్రానికి చెందిన మంగలి కొనింటి చిన్న బాలయ్య అనారోగ్యంతో శనివారం మృతి చెందారు. మృతుడికి ఒక కూతురు ఉండగా ఆమె ఒక ఆడ కూతురుకు జన్మనిచ్చి గతంలో మృతి చెందింది. దీంతో బాలయ్యకు మనుమరాలు గీత మాత్రమే ఉన్నారు. ఆయన మృతి చెందడంతో చివరకు గీత తలకొరివి పెట్టింది.
మోపాల్: మండలంలో ని కంజర్ గ్రామంలో ధాన్యం తరలించేందు కు వచ్చిన లారీ అగ్ని ప్రమాదంలో దగ్ధమైంది. ఎస్సై జాడె సుస్మిత తెలిపిన వివరాల ప్రకారం.. సొసైటీ ధాన్యం వద్దకు వెళ్లే క్రమంలో లారీ క్యాబిన్‌కు 11 కేవీ విద్యుత్ తీగలు తగిలాయి. క్షణాల్లోనే మంటలు లారీ టైర్లకు వ్యాపించి దగ్ధమయ్యాయి. స్థానికులు ఫైరింజన్‌కు సమాచారమివ్వగా ఇందల్వాయి నుంచి అగ్నిమాపక శకటం వచ్చి మంటలను ఆర్పేసింది. డ్రైవర్ సాయిలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామన్నారు. సుమారు రూ.4 లక్షల వరకు నష్టం జరిగినట్లు ఫైరింజన్ పైలెట్ ప్రకాశ్ పేర్కొన్నారు.


