నూతన సీఐకి సన్మానం
భిక్కనూరు: భిక్కనూరుకు బదిలీపై వచ్చిన నూతన సీఐ జగడం నరేష్‌ను మండల కేంద్రంలోని మున్నురుకాపు యువజన సంఘం ప్రతినిదులు శనివారం సన్మానించారు. సంఘ ప్రతినిదులు వడ్లూరి అశోక్, ముధాం క్రిష్ణ, సురేష్, దొబ్బి సిద్దరాములు, రంజిత్, అశోక్, రాము,శేఖర్, భాస్కర్‌లు పాల్గొన్నారు.
నిత్యావసర సరుకుల పంపిణీ
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలోని సామదుబ్బ తండాలో ఇటీవల షార్ట్‌సర్క్యూట్‌తో పలువురి గుడిసెలు దగ్ధమయ్యాయి. దీంతో బాధిత కుటుంబాలకు శనివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. పార్టీ మండల అద్యక్షుడు సంజీవులు, నాయకులు వెంకట్‌రెడ్డి, షౌకత్‌అలీ, రాజీవ్‌కుమార్, మేకల రాజు, సుధాకర్‌రావు, గంగారెడ్డి, సర్పంచ్‌లు జాదవ్ రేణుక, పోచయ్య తదితరులు పాల్గొన్నారు.
నియామకం
భిక్కనూరు: మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరాం వెంకటేశ్ నియమితులయ్యారు. ఈమేరకు యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరన్‌రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీచేశారు. తనకు పదవి రావడానికి సహకరించిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీకి వెంకటేశ్ కృతజ్ఞతలు తెలిపారు.
టీఆర్‌ఎస్ గ్రామ కమిటీ ఎన్నిక
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని కొట్టాల్‌గడ్డ తండాలో శనివారం టీఆర్‌ఎస్ గ్రామ కమిటీని జిల్లా అధ్యక్షుడు సంపత్‌గౌడ్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా రమావత్ మోహన్, ఉపాధ్యక్షుడిగా ఇస్లావత్ శివరామ్, యూత్ అధ్యక్షుడిగా రమావత్ నరేష్, యూత్ ఉపాధ్యక్షుడిగా మెగావత్ దేవిదాస్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. అలాగే ఆయా పార్టీల నుంచి పలువురు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. లింగంపేట మండల అధ్యక్షుడు పోకల సాయిరాం, జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రతాప్‌రెడ్డి, జిల్లా ఎస్టీసెల్ అధ్యక్షుడు జైల్‌సింగ్, శ్రీకాంత్, సాయిలు, శంకర్, మహేందర్, భరత్ తదితరులు పాల్గొన్నారు.
త్రీఫేజ్ విద్యుత్ వేళలు పెంచాలి
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలో త్రీఫేజ్ విద్యుత్ వేళలు పెంచాలని మండల సర్పంచ్‌లు, బీఆర్‌ఎస్ నాయకులు కోరారు. ఈమేరకు వారు శనివారం తాడ్వాయి సబ్‌స్టేషన్‌లో ట్రాన్స్‌కో సిబ్బందికి వినతి పత్రాన్ని అందజేశారు. మండలంలో త్రీఫేజ్ వి ద్యుత్‌ను 12గంటలు మాత్రమే ఇవ్వడంతో గ్రామా ల్లో బోరు మోటార్లు సరిగా నడవక తాగునీటికి ఇబ్బందులు అవుతున్నాయన్నారు. సింగిల్‌విండో చైర్మన్ కపిల్‌రెడ్డి, సర్పంచ్‌లు మంగారెడ్డి, చంద్రారెడ్డి, తాజోద్దీన్, నర్సిములు, బీఆర్‌ఎస్ నాయకులు రాములు, రాజిరెడ్డి, సంజీవ్, ధర్మారెడ్డి ఉన్నారు.


